Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ హిట్ టీమ్ ని దించిన హాట్ బ్యూటీ!

లైంగిక వేధింపుల నుండి బాలికలను ర‌క్షించే జ‌ర్న‌లిస్ట్ పాత్ర లో న‌టించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లందుకుంది.

By:  Tupaki Desk   |   27 Sep 2024 4:30 PM GMT
మ‌ళ్లీ హిట్ టీమ్ ని దించిన హాట్ బ్యూటీ!
X

బాలీవుడ్ హాట్ బ్యూటీ భూమీ ప‌డ్నేక‌ర్ వ‌రుస విజాయాల‌తో దూసుకుపోతున్న సంగ‌త తెలిసిందే. గ‌త ఏడాది అమ్మ‌డు ఏకంగా నాలుగు రిలీజ్ లతో మంచి ఫ‌లితాలే సాధించింది. `భీద్` ..` అఫ్వా` ..` థాంక్యూ ఫర్ కమింగ్` ..`ది లేడీ కిల్లర్` లాంటి విజ‌యాల‌తో మెప్పించింది. ఇటీవ‌ల రిలీజ్ అయిన క్రైమ్ థ్రిల్లర్ `భ‌క్ష‌క్` తోనూ మ‌రో విజ‌యం ఖాతాలో వేసుకుంది. లైంగిక వేధింపుల నుండి బాలికలను ర‌క్షించే జ‌ర్న‌లిస్ట్ పాత్ర లో న‌టించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లందుకుంది.

దీంతో భూమీకి అవ‌కాశాల జోరు అంత‌కంత‌కు పెరుగుతుంది. కొత్త ఛాన్సులు క్యూలో ఉన్నా డేట్లు ఇవ్వ‌లేని ప‌రిస్థితి క‌నిపిస్తుంది. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో అమ్మ‌డు మ‌ళ్లీ `భ‌క్ష‌క్` టీమ్తో మ‌రో ఛాన్స్ ఒడిసి ప‌ట్టుకుంది. పుల్కిత్-గౌరీఖాన్ అమ్మ‌డిని మ‌రో ప్ర‌ధాన పాత్ర‌కి ఎంపిక చేసింది. ఈ సంద‌ర్భంగా నిర్మాణ వ‌ర్గాలు స్పందించాయి. `ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి స్క్రిప్ట్ ప‌నులు ప్రారంభ ద‌శ‌లో ఉన్నాయి. భ‌క్ష‌క్ తో భూమీకి మంచి హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు-నిర్మాత మ‌రోసారి చేతులు క‌లిపారు.

ఈ సారి ఆమెని దృష్టిలో ఉంచుకుని క‌థ‌ని సిద్దం చేస్తున్నారు. త్వ‌ర‌లో పూర్తి వివ‌రాలు అధికారికంగా ప్ర‌క‌టిస్తాం` అని వెల్ల‌డించారు. భ‌క్ష‌క్ విజ‌యం త‌ర్వాత అమ్మ‌డు క‌థ‌ల విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తుంది. వైవిథ్య‌మైన క‌థ‌ల‌కే ప్రాధాన్య‌త ఇస్తుంది. అంత‌ర్జాతీయ స్థాయిలోనూ అమ్మ‌డికి మంచి గుర్తింపు ద‌క్కింది ఈ మ‌ధ్య‌నే. ప్ర‌పంచ ఆర్దిక వేదిక యంగ్ గ్లోబ‌ల్ లీడ‌ర్ గా కొత్త ఛాన్స్ తీసుకుంది.

క్లైమేట్ వారియ‌ర్ అండ్ భూమీ పౌండేష‌న్ ద్వారా ప‌ర్యావ‌ర‌ణానికి చేస్తోన్న విశేష సేవ‌ల‌కు గానూ యంగ్ గ్లోబ‌ల్ లీడ‌ర్ గా భూమీ ప‌డ్నేక‌ర్ ని ఎంపికైంది. దీంతో భూమీ ప‌డ్నేక‌ర్ 2025 లో జ‌రిగే ప్ర‌ఖ్యాత దావోస్ ప్ర‌పంచ ఆర్దిక వేదిక స‌ద‌స్సులో భూమీ భార‌త్ త‌రుపున ప్రాతినిధ్యం వ‌హిస్తూ ప్ర‌స‌గించ‌నుంది.