హీరోయిన్ లవ్ లెటర్, ఆమె భర్త చేతికి...!
తాజాగా ఈ అమ్మడు తనకు వచ్చిన ఒక లవ్ లెటర్ ను షేర్ చేసింది. ఒక అభిమాని నాకు లవ్ లెటర్ రాశాడు.
By: Tupaki Desk | 4 Dec 2023 5:21 AM GMTస్టార్ హీరోలు చిరంజీవి మొదలుకుని ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లతో పాటు పలువురు స్టార్ హీరోలతో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ భూమిక. ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా కొనసాగిన భూమిక ఈ మధ్య కాలంలో సైలెంట్ అయింది. హీరోయిన్ గా ఆమె ప్రస్థానం ముగించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతోంది.
హీరోయిన్ గా దక్కిన గుర్తింపు మరియు స్టార్ డమ్ కారణంగా ఇప్పుడు కూడా ఆమెకు వరుసగా సినిమా ల్లో నటించే అవకాశాలు దక్కుతున్నాయి. యంగ్ హీరోల సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటిస్తూ దూసుకు పోతున్న భూమిక సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంది.
తాజాగా ఈ అమ్మడు తనకు వచ్చిన ఒక లవ్ లెటర్ ను షేర్ చేసింది. ఒక అభిమాని నాకు లవ్ లెటర్ రాశాడు. అయితే అది నాకు పంపించకుండా నా భర్తకు పంపించాడు అంటూ ఆ లెటర్ ను భూమిక సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఆ లెటర్ లో సదరు అభిమాని భూమిక పై ఉన్న అభిమానంను చూపించడంతో పాటు ప్రేమను చూపించే ప్రయత్నం చేశాడు.
ఎవరైనా ప్రేమిస్తే డైరెక్ట్ గా ప్రేమ లేఖలు ఇస్తారు. కానీ ఇలా వారి జీవిత భాగస్వామికి పంపించడం ఏంట్రా బాబు అంటూ కొందరు నెటిజన్స్ సదరు భూమిక అభిమాని గురించి కామెంట్స్ చేస్తున్నారు. ఏదో ఒక విధంగా భూమిక దృష్టిలో పడ్డ ఆ అభిమాని లక్కీ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
2007 సంవత్సరంలో భరత్ ఠాకూర్ ని పెళ్లి చేసుకున్న భూమిక సంసార జీవితం పై అనేక పుకార్లు షికార్లు చేశాయి. ఆ మధ్య భరత్ ఠాకూర్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు అనే ప్రచారం కూడా జరిగింది. అంతా పుకార్లే... భూమిక మరియు భరత్ ఠాకూర్ లు కలిసే ఉన్నారు అనేందుకు తాజాగా ఈ పోస్ట్ లు నిదర్శనం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.