Begin typing your search above and press return to search.

అఖండ 2 లో ఆ హీరోయిన్.. ఛాన్స్ ఉందంటారా..?

అందుకే అఖండ 2 నుంచి ఆమెను తీసేసి ఒకప్పటి స్టార్ హీరోయిన్ భూమికకు అవకాశం ఇస్తున్నారని టాక్.

By:  Tupaki Desk   |   8 Jun 2024 4:01 AM GMT
అఖండ 2 లో ఆ హీరోయిన్.. ఛాన్స్ ఉందంటారా..?
X

నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే బాక్సాఫీస్ కి పండుగే.. బాలయ్యని ఎలా చూపిస్తే ఆయన ఫ్యాన్స్ ఇంకా ఆడియన్స్ ఇష్టపడతారో ఆ మీటర్ కి ఏమాత్రం తగ్గకుండా బోయపాటి సినిమాలు చేస్తాడు. అందుకే సింహా నుంచి బాలయ్య బోయపాటి కాంబో సూపర్ హిట్లు ఇస్తూనే వస్తున్నారు. ఇక రెండేళ్ల క్రితం వచ్చిన అఖండ ఐతే వీరి కాంబోని మరింత స్ట్రాంగ్ అయ్యేలా చేసింది. అఖండ సినిమాలో బాలకృష్ణ ఉగ్ర రూపం ఫ్యాన్స్ కే కాదు కామన్ ఆడియన్స్ కి కూడా ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసింది.

అఖండ సక్సెస్ అవ్వడంతో అఖండ 2 చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే బోయపాటి శ్రీను అఖండ 2 స్క్రిప్ట్ పూర్తి చేసినట్టు తెలుస్తుంది. అఖండ 2 సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతుంది. ఐతే ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రగ్యా జైశ్వాల్ కాకుండా మరో హీరోయిన్ నటించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. అఖండ లో ప్రగ్యా గ్లామర్ సినిమాకు ప్లస్ అయ్యింది. అయితే ఆ సినిమా అంత పెద్ద హిట్ అయినా అమ్మడికి ఆ తర్వాత ఒక్కటంటే ఒక్క ఛాన్స్ కూడా రాలేదు.

అందుకే అఖండ 2 నుంచి ఆమెను తీసేసి ఒకప్పటి స్టార్ హీరోయిన్ భూమికకు అవకాశం ఇస్తున్నారని టాక్. హీరోయిన్ గా దాదాపు తెలుగు స్టార్స్ అందరితో నటించిన భూమిక సెకండ్ ఇన్నింగ్స్ లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వస్తుంది. ఇప్పటికే నానితో M.C.A, నాగ చైతన్యతో సవ్యసాచి సినిమాలు చేసిన భూమిక పాగల్, సీటీమార్, సీతారామం సినిమాల్లో క్యామియోతో సర్ ప్రైజ్ చేసింది.

ఇప్పుడు బాలకృష్ణ సినిమాలో ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. బాలకృష్ణ తో భూమిక ఈ కాంబో అసలు ఏమాత్రం ఊహించలేదు. ఐతే భూమిక హీరోయిన్ గా మంచి ఫాంలో ఉన్నప్పుడు మాత్రం ఈ కాంబినేషన్ ని ఎవరు సెట్ చేయలేదు. మరి ఇప్పుడు అయినా బాలయ్య సినిమా ఆఫర్ ని భూమిక ఓకే చేస్తుందా అన్నది డౌటే అని చెప్పొచ్చు. అఖండ 2 సినిమాలో భూమిక నటిస్తే మాత్రం ఆమె కెరీర్ కు కూడా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా సూపర్ హిట్లు కొట్టిన భూమిక ఇప్పుడు సినిమాల్లో కేవలం చిన్న పాత్రలకే అంకితం అవ్వడం ఆమె ఫ్యాన్స్ ని హర్ట్ చేస్తుంది. కానీ ఇలా అయినా ఆడియన్స్ ని అలరిస్తున్నందుకు భూమిక మాత్రం సాటిస్ఫైడ్ గానే ఉందని చెప్పొచ్చు.