Begin typing your search above and press return to search.

14 ఏళ్ల వ‌య‌సులోనే భూమీప‌డ్నేక‌ర్ పై వేధింపులు!

బహుశా అప్పుడు 14 సంవత్సరాలు వ‌య‌సు అనుకుంటా. జాత‌ర కోసం నా కుటుంబంతో క‌లిసి బ‌య‌ట‌కు వెళ్లాను. అంతా న‌డుచుకుంటూ వెళ్తోన్న స‌మ‌యంలో న‌న్ను ఎవ‌రో వెన‌కి నుంచి గిచ్చారు.

By:  Tupaki Desk   |   4 Feb 2024 4:23 AM GMT
14 ఏళ్ల వ‌య‌సులోనే  భూమీప‌డ్నేక‌ర్ పై వేధింపులు!
X

బాలీవుడ్ హాట్ బ్యూటీ భూమీ ప‌డ్నేక‌ర్ వ‌రుస విజాయాల‌తో దూసుకుపోతున్న సంగ‌త తెలిసిందే. గ‌త ఏడాది అమ్మ‌డు ఏకంగా నాలుగు రిలీజ్ లతో మంచి ఫ‌లితాలే సాధించింది. 'భీద్' ..' అఫ్వా' ..' థాంక్యూ ఫర్ కమింగ్' ..'ది లేడీ కిల్లర్' లాంటి విజ‌యాల‌తో మెప్పించింది. తాజాగా అమ్మ‌డు క్రైమ్ థ్రిల్లర్ 'భ‌క్ష‌క్' తోనూ అల‌రించ‌డానికి రెడీ అవుతోంది. ఇందులో అమ్మ‌డు లైంగిక వేధింపుల నుండి బాలికలను ర‌క్షించే జ‌ర్న‌లిస్ట్ పాత్ర పోషించింది.

ఈ సినిమా రిలీజ్ సంద‌ర్భంగా అమ్మ‌డు తన‌కెదురైన లైంగిక వేధింపుల గురించి రివీల్ చేసింది. 14 ఏళ్ల వ‌య‌సులో ఓ ఆప‌రిచిత వ్య‌క్తి త‌న‌పై అనుచితంగా ప్ర‌వ‌ర్తించిన తీరును గుర్తు చేసుకుంది. ఆ గాయం నుంచి ఇప్ప‌టికీ బ‌య‌ట‌ప‌డ‌లేద‌ని...గుర్తొచ్చిన‌ప్పుడ‌ల్లా మాన‌సికంగా కృంగిపోతాన‌ని తెలిపింది. 'నాకు ఆ సంఘ‌ట‌న చాలా స్పష్టంగా గుర్తుంది. బాంద్రాలో అప్పట్లో జాతరలు జరిగేవి. నేను యుక్త వయస్సులో ఉన్నాను.

బహుశా అప్పుడు 14 సంవత్సరాలు వ‌య‌సు అనుకుంటా. జాత‌ర కోసం నా కుటుంబంతో క‌లిసి బ‌య‌ట‌కు వెళ్లాను. అంతా న‌డుచుకుంటూ వెళ్తోన్న స‌మ‌యంలో న‌న్ను ఎవ‌రో వెన‌కి నుంచి గిచ్చారు. నా ప్ర‌యివేటు భాగాలు తాకే ప్ర‌య‌త్నం చేసారు. వెనక్కు తిరిగి చూసినా రద్దీ ఎక్కువగా ఉండడంతో ఎవరు చేశారో? అర్థం కాలేదు. ఎవరో నన్ను అనుచితంగా మళ్లీ మళ్లీ తాకడానికి ప్రయత్నించారని అర్ధ‌మైంది.

దీంతో నేను మ‌తి స్థిమితం కోల్పోయిన‌ట్లు అయింది. అప్పుడు నా వాళ్లు అంతా నా చుట్టూ ఉన్నా ఏం చెప్ప‌లేక‌పోయాను' అని అంది. ఇంకా చిన్న వ‌య‌సులో లైంగిక వేధింపులు ఎదుర్కున్న వారిలో నిత్యా మీన‌న్ కూడా ఉంది. ఆమె ప‌ట్ల కూడా అనుచితంగా ప్ర‌వ‌ర్తించిన‌ట్లు గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపింది. ఇంకా ప‌లువురు న‌టీమ‌ణులు బాల్యంలో త‌మ‌కెదురైన చేదు అనుభ‌వాల గురించి మీటూ ఉద్య‌మం స‌మ‌యంలో తెర‌పైకి తెచ్చిన సంగ‌తి తెలిసిందే.