ఆడ మగా అనే తేడాలేదంటోంది!
బాలీవుడ్ హాట్ బ్యూటీ భూమీ పడ్నేకర్ వరుస విజాయాలతో దూసుకుపోతున్న సంగత తెలిసిందే.
By: Tupaki Desk | 6 April 2024 12:30 PM GMTబాలీవుడ్ హాట్ బ్యూటీ భూమీ పడ్నేకర్ వరుస విజాయాలతో దూసుకుపోతున్న సంగత తెలిసిందే. గత ఏడాది అమ్మడు ఏకంగా నాలుగు రిలీజ్ లతో మంచి ఫలితాలే సాధించింది. `భీద్` ..` అఫ్వా` ..` థాంక్యూ ఫర్ కమింగ్` ..`ది లేడీ కిల్లర్` లాంటి విజయాలతో మెప్పించింది. ఇటీవల రిలీజ్ అయిన క్రైమ్ థ్రిల్లర్ `భక్షక్` తోనూ మరో విజయం అందుకుంది. లైంగిక వేధింపుల నుండి బాలికలను రక్షించే జర్నలిస్ట్ పాత్ర లో నటించి విమర్శకుల ప్రశంసలందుకుంది.
తాజాగా ఈ బ్యూటీ లేడీ ఓరియేంటెడ్ చిత్రాలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. మహిళా ప్రాధాన్య చిత్రం అనే ట్యాగ్ లైన్ తగిలించుకున్నంత మాత్రాన ఒక సినిమా విజయం సాధించదని పేర్కొంది. `మాది లేడీ ఓరియేంటెడ్ సినిమా అని దర్శక-నిర్మాతలు ప్రకటించగానే ప్రేక్షకుల దృష్టంతా దానిపై పడుతుంది అనుకోవడం అపోహ. అసలు ఫీమేల్ లీడ్ ప్రాజెక్ట్ అనే పదం వింటేనే నాక చిరాకు కలుగుతుంది. జనం మంచి సినిమా కోరుకుంటారు తప్ప అందులో హీరో-హీరోయిన్ ఎవరు? ఎవరి ప్రాధాన్యత ఎంత అని ఆలోచించచరు.
అదే గనుక నిజమైతే నేను ఇంతదూరం వచ్చేదాన్ని కాదు. అయితే కొందరు దర్శకరచయితలు నా నటనా పనితీరు నచ్చి ఆప్రతిభ ప్రదర్శించేలా బలమైన పాత్రలు రాయడం నా అదృష్టం. అందుకు వారికి ఎప్పుడూ రుణపడే ఉంటాను` అని అంది. అయితే భూమీ పడ్నేకర్ వ్యాఖ్యలపై కొన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లేడీ ఓరియేంటెడ్ సినిమాని భూమీ పడ్నేకర్ అంతగా ఎందుకు వ్యతిరేకిస్తుందని ఒకరు ప్రశ్నించారు.
ఇలాంటి సినిమాలు కేవలం స్టార్ హీరోయిన్లతోనే తెరకెక్కిస్తారు. వాళ్లు మార్కెట్ లో సోలోగా సత్తా చాటాలి. అలాంటి వారు మాత్రమే అర్హులు. ఆ జాబితాలో భూమీపడ్నేకర్ ఇంకా చేరలేదు. అందుకే అమె ఫీమేల్ లీడ్స్ చిత్రాలకు వ్యతిరేకంగా మాట్లాడుతుందని మరో అభిమాని పోస్ట్ పెట్టాడు. మరి వీటికి భూమీ రిప్లై ఇస్తుందేమో చూడాలి.