స్టైల్ కా బాప్ అనిపించావ్ గా అమ్మడు!
బాలీవుడ్ హాట్ బ్యూటీ భూమీపడ్నేకర్ గ్లామర్ ఎలివేషన్ల గురించి చెప్పాల్సిన పనిలేదు.
By: Tupaki Desk | 26 April 2024 5:48 AM GMTబాలీవుడ్ హాట్ బ్యూటీ భూమీపడ్నేకర్ గ్లామర్ ఎలివేషన్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆన్ స్క్రీన్ అయినా..ఆఫ్ ది స్క్రీన్ అయినా భూమీ మార్క్ పడాల్సిందే. అందులోనూ ఫ్యాషన్ ఎంపికల్లో తనకంటూ ఓబ్రాండ్ ఐడెంటిటీ ఉందని ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తూనే ఉంటుంది. డిజైనర్ క్రియేటివిటీని మించి ఎలివేట్ చేయడం భూమీ ప్రత్యేకత. చిట్టి పొట్టి దుస్తులతో పాటు డిజైనర్ దుస్తుల్లో తనదైన మార్క్ అప్పిరియన్స్ తో దూసుకోవడం అన్నది భూమీకే చెల్లింది.
తాజాగా అమ్మడు మరోసారి స్టైలింగ్ లో సత్తా చాటింది. జీక్యూ టీచర్స్ ఈవెంట్ కోసం అమ్మడు ముస్తాబైన విధానం నెటి జనుల్ని ఆకర్షిస్తుంది. ఇదిగో ఇక్కడిలా తెలుపు రంగు న్యూ డిజైన్ లో సంథింగ్ స్పెషల్ గా ఆకట్టుకుంటుంది. టాప్ టూ బాటమ్ వైట్ డిజైన్ ప్లోరల్ దుస్తుల్లో అమ్మడు ఎంతో మనోహరంగా కనిపిస్తుంది. క్లీవేజ్ షో లో న్యూట్రెండ్ ని ఈ డిజైన్స్ లో భూమిపడ్నేకర్ పరిచయం చేసిందనొచ్చు. నెక్ నుంచి హిప్ వరకూ ప్రంట్ నుంచి తనలో బ్యూటీని హైలైట్ చేసింది. ఈ డిజైన్ కోసమే శరీరంలో మార్పులు తీసుకొచ్చిందా? అన్నంత పర్పెక్ట్ గా ఆ డ్రెస్ ఫిట్ అయింది.
ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ డ్రెస్ పై నెగిటివ్ కామెంట్లు ఎక్కువగా ఫోకస్ అవుతున్నాయి. అలాంటి దుస్తులు ఎందుకు అవసరం? మంచి దుస్తులు ఎందుకు ధరించకూడదు? డీసెంట్ డ్రెస్ కూడా బాగుటుంది? కదా! అలా మీరెందుకు ఆలోచించరు అంటూ ఓ నెటిజనుడు పోస్ట్ పెట్టాడు. మరోకరి పాజిటివ్ కామెంట్ చూస్తే! ఈ డ్రెస్ కోసమే అమె ప్రత్యేకంగా సిద్దమైంది! శరీరాకృతిలో మార్పులు కూడా ఈ డ్రెస్ కోసమే చేసినట్లుంది? ఉంది. ఇది ఎంతో కష్టమో ఫ్యాషన్ డిజైనర్ గా నాకు తెలుసంటూ మరొకరు పోస్ట్ చేసారు. ఇంకా ఇలాంటి కామెంట్లు లెక్కలేనన్నివి ఉన్నాయి.
బ్యూటీ భూమీ పడ్నేకర్ కెరీర్ సంగతి చూస్తూ వరుస విజాయాలతో దూసుకుపోతున్న సంగత తెలిసిందే. గత ఏడాది అమ్మడు ఏకంగా నాలుగు రిలీజ్ లతో మంచి ఫలితాలే సాధించింది. `భీద్` ..` అఫ్వా` ..` థాంక్యూ ఫర్ కమింగ్` ..`ది లేడీ కిల్లర్` లాంటి విజయాలతో మెప్పించింది. ఇటీవల రిలీజ్ అయిన క్రైమ్ థ్రిల్లర్ `భక్షక్` తోనూ మరో విజయం అందుకుంది. లైంగిక వేధింపుల నుండి బాలికలను రక్షించే జర్నలిస్ట్ పాత్ర లో నటించి విమర్శకుల ప్రశంసలందుకుంది.