Begin typing your search above and press return to search.

బిబి గొడవ.. టబు వచ్చి రాజీ కుదిర్చేనా?

బిగ్‌ బాస్ హిందీలో మొదలు అయ్యి ఇప్పుడు దేశం మొత్తం కూడా ప్రాంతీయ భాషల్లో టెలికాస్ట్‌ అవుతోంది.

By:  Tupaki Desk   |   6 Jan 2024 10:24 AM GMT
బిబి గొడవ.. టబు వచ్చి రాజీ కుదిర్చేనా?
X

ఇండియాలో గత దశాబ్ద కాలంగా బిగ్ బాస్ ఫీవర్‌ కొనసాగుతోంది. బిగ్‌ బాస్ హిందీలో మొదలు అయ్యి ఇప్పుడు దేశం మొత్తం కూడా ప్రాంతీయ భాషల్లో టెలికాస్ట్‌ అవుతోంది. ఇక హిందీ బిగ్ బాస్ విషయానికి వస్తే 17వ సీజన్ నడుస్తోంది. ఎప్పటిలాగే ఈ సీజన్ కి కూడా సల్మాన్‌ ఖాన్‌ హోస్టింగ్‌ చేస్తున్నాడు.


గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈ సీజన్ లో ఒక కంటెస్టెంట్ పై మరో కంటెస్టెంట్ సీరియస్ గా చేయి చేసుకోవడం చర్చనీయాంశం అయ్యింది. అభిషేక్‌ మరియు సమర్థ్‌ జురెల్‌ మధ్య గొడవ జరిగి.. ఆ గొడవ కాస్త తీవ స్థాయికి వెళ్లి చివరకు సహనం కోల్పోయిన అభిషేక్ ఏకంగా సమర్థ్‌ పై చేయి చేసుకున్నాడు.

ఈ గొడవపై సీరియస్ అయిన కెప్టెన్‌ అంకితా లోఖండే వెంటనే అభిషేక్ ను డైరెక్ట్‌ గా ఎలిమినేట్‌ చేయడం జరిగింది. ఒక వైపు సమర్థ కు వ్యతిరేకంగా కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు కెప్టెన్ అంకితా లోఖండే కి వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నారు.

కెప్టెన్‌ నిర్ణయం పై నేడు సల్మాన్ ఖాన్‌ ఎలా రియాక్ట్‌ అవుతాడు అనేది చర్చనీయాంశంగా మారింది. నేడు ఎపిసోడ్‌ లో సల్మాన్‌ ఖాన్‌ తో పాటు హీరోయిన్‌ టబు కూడా హోస్ట్‌ గా రాబోతుంది. ఇద్దరి మధ్య గొడవ, కొట్టుకోవడం ఇలా చాలా పరిణామాలు జరిగిన నేపథ్యంలో టబును రంగంలోకి దించుతున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

గొడవ పడ్డ అభిషేక్‌ మరియు సమర్థ్‌ ల తో టబు పర్సనల్ గా చర్చలు జరిపే అవకాశాలు ఉన్నాయని కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం టబు వచ్చి మాత్రం ఏం చేస్తుంది... అయినా సల్మాన్‌ ఖాన్‌ స్పందించాల్సిన ఇష్యూ గురించి ఆమె ఎందుకు స్పందిస్తుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.