వేణు ఎల్లమ్మకి పెద్ద ఛాలెంజ్ అదే..!
వేణు ఎల్లమ్మ అంటూ మరో కొత్త కథతో రాబోతున్నాడు. ఇది ఎల్లమ్మ తల్లి కథా నేపథ్యంతో వస్తుందని తెలుస్తుంది.
By: Tupaki Desk | 26 Dec 2024 4:57 AM GMTకమెడియన్ గా చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చే వేణు జబర్దస్త్ షోతో సూపర్ పాపులర్ అయ్యాడు. ఐతే అతనిలో దర్శకుడు అయ్యే క్వాలిటీస్ ఉన్నాయని అతను సినిమా తీసే దాకా తెలియదు. ఏదో సినిమా తీశాడంటే తీశాడన్నట్టు కాకుండా కొన్నాళ్ల పాటు గుర్తుండిపోయే సినిమా తీశాడు. బలగం వేణు ఫేటే మార్చేసింది. కమెడియన్ లో ఇంత సెన్సిటివ్ యాంగిల్ ఉందా అంటూ డైరెక్టర్ గా వేణుని ప్రశంసించని వారు లేరంటే నమ్మాలి. ఐతే బలగం సినిమాకు దిల్ రాజు వెనక ఉండి వారి పిల్లలని ముందు ఉంచాడు.
ఐతే వేణు రెండో సినిమాకు ఏకంగా దిల్ రాజు రంగంలోకి దిగుతున్నాడు. వేణు ఎల్లమ్మ అంటూ మరో కొత్త కథతో రాబోతున్నాడు. ఇది ఎల్లమ్మ తల్లి కథా నేపథ్యంతో వస్తుందని తెలుస్తుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తైందని త్వరలో సినిమా మొదలు పెడతామని వేణు చెప్పారు. ఐతే బలగం సినిమాలో ఎక్కువగా అందరు కొత్త వారితోనే వేణు సినిమా లాగించాడు. కొత్త వారి దగ్గర నుంచి అతనికి కావాల్సిన ఎమోషన్ ని తీసుకున్నాడు.
ఇప్పుడు వేణు ఎల్లమ్మ కోసం నితిన్ ని తీసుకుంటున్నాడు. అంతేకాదు ఎల్లమ్మ టైటిల్ రోల్ సాయి పల్లవి చేస్తుందని ఒక న్యూస్ గట్టిగా వినిపిస్తుంది. నితిన్, సాయి పల్లవి లాంటి స్టార్స్ ని హ్యాండిల్ చేయడం అన్నది కాస్త కష్టమే. ఐతే వారికి పాత్రని ఎక్కిస్తే మాత్రం మరో అద్భుతం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా సాయి పల్లవి ఈ సినిమా చేస్తుంది అనేది నిజం అయితే సగం సినిమా సక్సెస్ అయినట్టే. వేణు ఎల్లమ్మ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.
రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో వేణు కూడా బలగం తెలంగాణ నేపథ్య కథ అన్న టాక్ ఉంది. ఐతే ఎల్లమ్మ శక్తి రూపం అందుకే ఇది ఒక ప్రాంతానికి సంబందించిన కథగా కాకుండా అందరు వారి వారి శక్తిరూపా స్వరూపాలను చూసుకునేలా సినిమా చేస్తున్నామని అన్నారు. వేణు ఎల్లమ్మకి ఈ స్టార్స్ ని హ్యాండిల్ చేయడమే పెద్ద ఛాలెంజ్ అనిపిస్తుండగా వారు పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తే మళ్లీ వేణు మ్యాజిక్ చేసే ఛాన్స్ ఉన్నట్టే లెక్క. దిల్ రాజు కూడా ఈ సినిమాకు వేణు కోరినంత బడ్జెట్ కేటాయిస్తున్నాడని టాక్.