రామ్ పోతినేని.. అంత పెద్ద స్టార్స్ సెట్టవుతారా?
ఇదిలా ఉంటే ఈ సినిమాలో రామ్ పోతినేనితో సమానమైన మరో హీరో క్యారెక్టర్ కూడా ఉంటుందంట.
By: Tupaki Desk | 21 Nov 2024 10:30 AM GMTయంగ్ హీరో రామ్ పోతినేని నుంచి చివరిగా వచ్చిన ‘ది వారియర్’, ‘స్కంద’, ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాలు బిగ్గెస్ట్ డిజాస్టర్స్ గా మారాయి. ఈ సినిమాలు ఒకదానిని మించి ఒకటి భారీ నష్టాలని మిగిల్చాయి. అయితే ఈ సారి ఎలా అయిన హిట్ కొట్టాలనే కసితో ఉన్న రామ్ పోతినేని యంగ్ డైరెక్టర్ మహేష్ బాబుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ తో హిట్ కొట్టిన మహేష్ బాబు చెప్పిన కథ రామ్ పోతినేనికి నచ్చడంతో ఒకే చెప్పేసాడు.
తాజాగా ఈ మూవీ ప్రీలుక్ పోస్టర్ రిలీజ్ చేసి సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. అటు పూర్తిగా మాస్, ఇటు కంప్లీట్ క్లాస్ టచ్ తో కాకుండా విభిన్న కథాంశంతో ఈ మూవీ కథ ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది. అన్ని వర్గాల వారికి రీచ్ అయ్యే కాన్సెప్ట్ అని రామ్ పోతినేని ఈ చిత్రాన్ని మొదలు పెట్టాడంట. త్వరలో సినిమాని అఫీషియల్ గా లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో రామ్ పోతినేనితో సమానమైన మరో హీరో క్యారెక్టర్ కూడా ఉంటుందంట.
ఈ పాత్ర కోసం ఒక సీనియర్ హీరో అవసరం ఉందని తెలుస్తోంది. అది కూడా స్టార్ ఇమేజ్ ఉన్న హీరో అయితే కరెక్ట్ గా ఉంటుందని దర్శకుడు మహేష్ బాబు అనుకుంటున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ఆ క్యారెక్టర్ కోసం యాక్టర్ ని ఫైనల్ చేసే పనిలో మేకర్స్ ఉన్నారు. యూనివర్శల్ యాక్టర్ కమల్ హాసన్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆయన డేట్స్ అడ్జస్ట్ కాలేదని టాక్ వినిపిస్తోంది. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ ఉంటే బాగుంటుందని భావిస్తున్నారంట.
కానీ అతను చేస్తాడో లేదో క్లారిటీ లేదు. మహేష్ బాబు మాత్రం సంప్రదింపులు జరుపుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. కచ్చితంగా మంచి ఫేమ్ ఉన్న సీనియర్ హీరోని ఈ సినిమా కోసం తీసుకునే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు. మరి రామ్ పోతినేనితో స్క్రీన్ షేర్ చేసుకునే ఆ స్టార్ హీరో ఎవరవుతారా అనే ఆసక్తి అందరిలో ఉంది.
మహేష్ బాబు మాత్రం కచ్చితంగా ఈ సినిమాని మల్టీ స్టారర్ మూవీగానే తెరకెక్కించాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం సౌత్ లో లీడింగ్ స్టార్స్ గా ఉన్న కమల్, రజినీకాంత్, శివరాజ్ కుమార్, మోహన్ లాల్ వీరిలో ఎవరిని తీసుకున్న సినిమాకి భారీ హైప్ రావడం గ్యారెంటీ అనుకుంటున్నారు. రామ్ పోతినేని గతంలో విక్టరీ వెంకటేష్ తో కలిసి ‘మసాలా’ మూవీలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే ఆ సినిమా అంతగా హిట్ కాలేదు. మరి ఈసారి మల్టీస్టారర్ కాన్సెప్ట్ రామ్ కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.