అంత పెద్ద స్టార్లు అలా తప్పించుకున్నారు
పరిశ్రమలో పెద్ద హీరోలు భేషజాలకు పోకుండా ఒకరికొకరు సహకరిస్తూనే ఉన్నారు.
By: Tupaki Desk | 3 Jan 2025 7:30 PM GMTబాలీవుడ్ లో అత్యంత భారీ కాస్టింగ్ తో మల్టీస్టారర్లు తెరకెక్కించే ట్రెండ్ ఈనాటిది కాదు. రెండున్నర దశాబ్ధాలుగా హిందీ చిత్రసీమలోని అగ్ర తారలు ఒకరితో ఒకరు కలిసి పని చేసే వాతావరణం ఉంది. పరిశ్రమలో పెద్ద హీరోలు భేషజాలకు పోకుండా ఒకరికొకరు సహకరిస్తూనే ఉన్నారు.
2004లో విడుదలైన 'అబ్ తుమ్హారే హవాలే వతన్ సాథియో' అదే తరహాలో రూపొందిన భారీ మల్టీస్టారర్. ఇందులో అమితాబ్-అక్షయ్- బాబి డియోల్ లాంటి స్టార్లు నటించారు. అనిల్ శర్మ దర్శకత్వం వహించారు. కానీ ఈ సినిమా నాశిరకం మేకింగ్ కారణంగా డిజాస్టరైంది. ఇలాంటి డిజాస్టర్ కోసం మొదట మేకర్స్ ఎంపిక చేసుకున్న కాస్టింగ్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేం. ఈ చిత్రంలో అమితాబ్‌తో పాటు షారూఖ్, ఐశ్వర్యారాయ్, ప్రియాంక చోప్రా లాంటి పెద్ద స్టార్లు నటించాలని పట్టుపట్టారు. దానికోసం వారిని ఒప్పించే ప్రయత్నం కూడా జరిగింది. కానీ ఎస్.ఆర్.కే, ఐష్, పీసీ రకరకాల కారణాలతో ఈ ప్రాజెక్టులో నటించలేదు.
మొదట అనుకున్న స్టార్లు కాల్షీట్లు ఇవ్వకపోవడంతో దర్శకనిర్మాతలు వారి స్థానంలో అక్షయ్, బాబి డియోల్ ని ఎంపిక చేసుకుని, కథానాయికలుగా దివ్య ఖోస్లా కుమార్, సందాలి సిన్హా, నగ్మ లాంటి అంతగా బజ్ లేని వారిని ఎంపిక చేసుకున్నారు. దివ్య ఖోస్లా కుమార్ , సందాలి సిన్హా ఈ సినిమాతోనే తెరకు పరిచయమయ్యారు. అప్పటికి నగ్మా సౌత్ లో అగ్ర కథానాయికగా కొనసాగుతోంది.
అయితే ఈ సినిమా రిలీజై ఇప్పటికి 20 సంవత్సరాలైంది. ఇన్నేళ్ల తర్వాత ఇందులో నటించని స్టార్లు ఎలాంటి రిగ్రెట్ ఫీలవ్వకపోవడానికి కారణం.. కంటెంట్ నీరసంగా ఉండటమేనని విమర్శలొచ్చాయి. తమకు నచ్చని కథల్ని స్టార్లు స్వేచ్ఛగా తిరస్కరించే రోజులవి. అందుకే షారూక్, ఐశ్వర్యారాయ్, ప్రియాంక చోప్రా లాంటి పెద్ద స్టార్లు స్క్రిప్టు విన్న తర్వాత తాము చేయలేమని తిరస్కరించారు. అనీల్ శర్మ ఎంపిక చేసుకున్న కథాంశం, మేకింగ్ శైలి అప్పట్లో నీరసం తెచ్చాయని ప్రేక్షకులు విమర్శించారు. అయితే పెద్ద స్టార్లు నటించి ఉంటే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కనీస వసూళ్లను సాధించి ఉండేదని కూడా కొందరు నెటిజనులు వాదిస్తున్నారు. ఈ సినిమా థియేట్రికల్ గా వర్కవుట్ కాకపోయినా ఓటీటీలో కొంత ఆదరణ దక్కించుకుంది. దేశభక్తి , ఫ్యామిలీ డ్రామా కథతో రూపొందించిన ఈ చిత్రం ఒక సెక్షన్ కి ఓటీటీలో బాగానే ఎక్కింది.