Begin typing your search above and press return to search.

ఇన్నాళ్లు జబర్దస్త్‌ నుంచి బిగ్‌ బాస్‌.. ఇప్పుడు రివర్స్‌!

కేవలం గుర్తింపు కోసమే చాలా మంది జబర్దస్త్‌ లో పారితోషికం ఇవ్వకుండానే కనిపించేందుకు సిద్ధం అవుతారు.

By:  Tupaki Desk   |   6 Nov 2023 5:59 AM GMT
ఇన్నాళ్లు జబర్దస్త్‌ నుంచి బిగ్‌ బాస్‌.. ఇప్పుడు రివర్స్‌!
X

జబర్దస్త్‌ ద్వారా ఆదాయం తక్కువ వచ్చినా గుర్తింపు మాత్రం బాగా దక్కుతుందని చాలామంది కమెడియన్స్ తీవ్ర ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా ఈ షో లో చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. చాలా మంది కమెడియన్స్‌ జబర్దస్త్‌ లో చేస్తే మాకు చార్జీలు, ఇతర ఖర్చుల వరకు కూడా పారితోషికం రాదని చెప్పిన ఇంటర్వ్యూలు చాలా ఉన్నాయి.

కేవలం గుర్తింపు కోసమే చాలా మంది జబర్దస్త్‌ లో పారితోషికం ఇవ్వకుండానే కనిపించేందుకు సిద్ధం అవుతారు. అలాంటి జబర్దస్త్‌ నుంచి ఇప్పటి వరకు పలువురు బిగ్‌ బాస్‌ షో కి వెళ్లిన విషయం తెల్సిందే. బిగ్‌ బాస్ కి వెళ్లిన వారికి మళ్లీ జబర్దస్త్‌ లో ఛాన్స్ లేదు అంటూ గతంలో మల్లెమాల వారు అనేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయినట్లుగా ఉంది.

చంటి మరియు ఫైమాలు బిగ్‌ బాస్ నుంచి వచ్చిన తర్వాత జబర్దస్త్‌ లో ఎంట్రీ ఇచ్చారు. ఇక బిగ్‌ బాస్ మాజీ కంటెస్టెంట్‌ అయిన సిరి హన్మంత్‌ కి ఏకంగా జబర్దస్త్‌ యాంకర్ సీటును కట్టబెట్టారు. జబర్దస్త్‌ యొక్క నాల్గవ యాంకర్‌ గా సిరికి ఛాన్స్ దక్కింది. ఈ వారం లో టెలికాస్ట్‌ కాబోతున్న జబర్దస్త్‌ ఎపిసోడ్‌ లో సిరి హనుమంత్ యాంకర్ గా కనిపించబోతుంది.

జబర్దస్త్‌ ప్రారంభం అయిన సమయంలో అనసూయ యాంకరింగ్‌ చేసింది. మధ్య లో ఆమె వెళ్లి పోవడంతో రష్మి గౌతమ్‌ జబర్దస్త్‌ యాంకర్‌ గా ఎంట్రీ ఇచ్చింది. మళ్లీ అనసూయ రీ ఎంట్రీ ఇచ్చింది. అదే సమయంలో రష్మి గౌతమ్ కూడా కొనసాగుతూ వచ్చింది. ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ కి రష్మీ యాంకర్ గా కొనసాగుతూ సుదీర్ఘ కాలంగా కంటిన్యూ అవుతోంది.

ఇక జబర్దస్త్‌ నుంచి ఆ మధ్య అనసూయ తప్పుకోవడం.. సీరియల్‌ ల్లో నటించే సౌమ్య రావును జబర్దస్త్‌ యాంకర్ గా తీసుకు రావడం జరిగింది. చాలా వారాల పాటు సౌమ్య కి జబర్దస్త్‌ యాంకరింగ్ ఛాన్స్ దక్కింది. కానీ ఉన్నట్లుండి ఆమెను తొలగించి సిరి హన్మంత్‌ కి ఛాన్స్ లభించింది. బిగ్ బాస్ లో షన్నూ తో లవ్‌ ట్రాక్ వల్ల బాగా వైరల్‌ అయిన సిరికి జబర్దస్త్‌ ఛాన్స్ దక్కిందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని సద్వినియోగం చేసుకుంటే కచ్చితంగా వెండి తెరపై కూడా మంచి ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉంటాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.