Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 8.. మరింత లేట్ అవుతుందా..?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో కంటెస్టెంట్స్ గా ఎవరెవరు ఉంటారో ఇంకా ఫైనల్ కాలేదు.

By:  Tupaki Desk   |   31 May 2024 10:30 AM GMT
బిగ్ బాస్ 8.. మరింత లేట్ అవుతుందా..?
X

సూపర్ హిట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటివరకు 7 సక్సెస్ ఫుల్ సీజన్లు పూర్తి చేసుకుంది. హిందీలో 15 సీజన్లకు పైగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగులో మాత్రం 7 సీజన్లు పూర్తి చేసుకుంది. సీజన్ 7 విన్నర్ గా పల్లవి ప్రశాంత్ గెలిచిన వెంటనే అరెస్ట్ అవ్వడం.. రన్నరప్ అమర్ దీప్ కారు మీద ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి చేయడం కాస్త ఇబ్బందిగానే అనిపించింది. బిగ్ బాస్ సీజన్ 7 టైం లో జరిగిన రచ్చ ని దృష్టిలో ఉంచుకుని సీజన్ 8 లో అవి రిపీట్ అవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు బిగ్ బాస్ టీం.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో కంటెస్టెంట్స్ గా ఎవరెవరు ఉంటారో ఇంకా ఫైనల్ కాలేదు. అయితే ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 8 లో కన్ ఫరండ్ కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ కొందరు బిగ్ బాస్ రివ్యూయర్స్ డప్పు కొట్టడం మొదలు పెట్టారు. బిగ్ బాస్ చూసే వాళ్లంతా బిగ్ బాస్ రివ్యూయర్స్ ని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 8 జూన్, జూలైలో మొదలు పెడతారేమో అనుకున్న ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్ లో మొదలు పెడతారని లేటెస్ట్ టాక్. అయితే ఇప్పటికే సెలక్షన్ ప్రాసెస్ మొదలు పెట్టారని తెలుస్తుంది. ఆల్రెడీ లాస్ట్ సీజన్ లో సెలెక్ట్ అయినా ఏవో కారణాల వల్ల ఆగిపోయిన కొందరు ఈసారి కంటెస్టెంట్స్ గా వస్తారని తెలుస్తుంది. ఈసారి కూడా సెలబ్రిటీ కంటెస్టెంట్స్ తో షోని మరింత రసవత్తరంగా మార్చాలని చూస్తున్నారు బిగ్ బాస్ టీం.

బిగ్ బాస్ సీజన్ 8 కి హోస్ట్ గా నాగార్జుననే కన్ఫర్మ్ అంటున్నారు. ప్రతి సీజన్ కంటెస్టెంట్స్ మాదిరిగానే హోస్ట్ విషయంలో కూడా మార్పు ఉంటుందని అనుకోగా నాగార్జున హోస్ట్ గా చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పడంతో మళ్లీ కింగ్ ని కొనసాగించేలా ప్లాన్ చేస్తున్నారట. బిగ్ బాస్ సీజన్ 8 లో కంటెస్తెంట్స్ విషయంలో కూడా టీం చాలా జాగ్రత్త వహిస్తున్నట్టు తెలుస్తుంది. సీజన్ 7 లో జరిగిన తప్పులు రిపీట్ అవ్వకూడదని ఈసారి కండీషన్స్ మరింత కఠినంగా చేస్తున్నారని తెలుస్తుంది. మరి బిగ్ బాస్ సీజన్ 8 లో ఎవరెవరు కంటెస్టెంట్స్ వస్తారన్నది త్వరలో అఫీషియల్ గా తెలుస్తుంది.