Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 8 : అభయ్ వర్సెస్ కిరాక్ సీత.. ఏడిపించేశారు..!

ఇదే టైం లో కిచెన్ లోకి వెళ్లి అభయ్ ఆమ్లెట్ వేసుకోవాలని అనుకోగా అతనితో కిరాక్ సీత వాదన పెట్టుకోగా అతను ఆమెను నీకు దిమాక్ లేదా నువ్వు నా కింద ఏమైనా పని చేయడానికి వచ్చావా ఇది ఆట అంటూ ఫైర్ అయ్యాడు.

By:  Tupaki Desk   |   7 Sep 2024 3:44 AM GMT
బిగ్ బాస్ 8 : అభయ్ వర్సెస్ కిరాక్ సీత.. ఏడిపించేశారు..!
X

బిగ్ బాస్ సీజన్ 8 లో శుక్రవారం ఎపిసోడ్ లో హౌస్ మెట్స్ మధ్య చిన్న పాటి వాదులాట కొనసాగింది. ప్రస్తుతం తమ క్లాన్ ని పెంచుకునే టాస్క్ లో నైనిక, యష్మిల మధ్య జరిగిన రెండు టాస్కుల్లో మూడింటిలో రెండు యష్మి టీం గెలవడంతో నిఖిల్ టీం లోని ఒక హౌస్ మెట్ ని యష్మి క్లాన్ లోకి తీసుకోమని బిగ్ బాస్ చెప్పగా టీం అంతా కలిసి సోనియాని యష్మి టీం లోకి తీసుకున్నారు. బిగ్ బాస్ యష్మి, నిఖిల్, నైనికలను కన్ ఫెషన్ రూం లోకి పిలిచి అతి పెద్ద క్లాన్ అయిన కారణంగా యష్మి క్లాన్ లోని సభ్యులెవరు ఇంటి పనులు చేయాల్సిన అవసరం లేదని చెప్పాడు.

మరోపక్క మిగతా పనులన్నీ ఎవరు చేయాలన్నది కూడా యష్మినే నిర్ణయించాలని బోర్డ్ మీద పనులు అసైన్ చేయమని చెప్పాడు. దీనికి ముందే మూడు క్లాన్ లకు మూడు పేర్లు పెట్టాలని బిగ్ బాస్ ఆర్డర్ ప్రకారం నిఖిల్ క్లాన్ కు కెరటం, నైనిక టీం కు అంతులేని వీరులు, యష్మి టీం కు అఖండ అని పేర్లు పెట్టారు. ఐతే నైనిక క్లాన్ లోని సభ్యులే ఇంటి పనులన్ని చేయాలని తెలియడంతో ఆ టీం లో సభ్యులు కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు.

12 మంది చేయాల్సిన పనులు ఐదుగురు ఎలా చేస్తారని విష్ణు ప్రియ, కిరాక్ సీత మాట్లాడటం మొదలు పెట్టారు. ఇదే టైం లో కిచెన్ లోకి వెళ్లి అభయ్ ఆమ్లెట్ వేసుకోవాలని అనుకోగా అతనితో కిరాక్ సీత వాదన పెట్టుకోగా అతను ఆమెను నీకు దిమాక్ లేదా నువ్వు నా కింద ఏమైనా పని చేయడానికి వచ్చావా ఇది ఆట అంటూ ఫైర్ అయ్యాడు. ఆ గొడవ తర్వాత కిరాక్ సీత బెడ్ మీదకు వెళ్లి బాధపడింది. ఆ తర్వాత మళ్లీ డైనింగ్ టేబుల్ దగ్గర పృధ్విరాజ్ తో తన బాధను వెళ్లగక్కింది. కనీసం తిన్న ప్లేట్లు కూడా సింక్ లో వేయలేకపోతున్నారా అని మాట్లాడింది.

మొత్తానికి జరిగిన టాస్క్ లో గెలిచి అతి పెద్ద క్లాన్ గా యష్మి టీం నిలిచింది. ఈ క్లాన్ తో నెక్స్ట్ ఏం చేస్తారు బిగ్ బాస్ తర్వాత గేం ప్లాన్ ఏంటన్నది మాత్రం రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఆల్రెడీ ఈ క్లాన్ ఏర్పడ్డ టైం లోనే బిగ్ బాస్ మీరు తీసుకునే ఈ నిర్ణయమే మీ బిగ్ బాస్ జర్నీని నిర్ణయిస్తుంది అని చెప్పాడు. సో ఈ క్లాన్ విధానం ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి. ఆరుగురు సభ్యులతో అతి పెద్ద క్లాన్ గా యష్మి టీం ఉండగా ముగ్గురు సభ్యులతో నిఖిల్ టీం చిన్న క్లాన్ గా ఉంది.