Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 8 : మిడ్ వీక్ ఎలిమినేషన్ తో ట్విస్ట్..!

బిగ్ బాస్ సీజన్ 8 ఇప్పటికే ఆడియన్స్ ని సూపర్ గా ఎంటర్టైన్ చేస్తుంటే సీజన్ 8 ఆటని మరింత క్రేజీగా మార్చేలా బిగ్ బాస్ టీం ప్లాన్ చేస్తుంది.

By:  Tupaki Desk   |   1 Oct 2024 1:30 PM GMT
బిగ్ బాస్ 8 : మిడ్ వీక్ ఎలిమినేషన్ తో ట్విస్ట్..!
X

బిగ్ బాస్ సీజన్ 8 ఇప్పటికే ఆడియన్స్ ని సూపర్ గా ఎంటర్టైన్ చేస్తుంటే సీజన్ 8 ఆటని మరింత క్రేజీగా మార్చేలా బిగ్ బాస్ టీం ప్లాన్ చేస్తుంది. ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 8 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ప్లాన్ చేశారు. సీజన్ 8 లో ఈ వారాంతరం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయని తెలుస్తుంది. వీకెండ్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇచ్చే వారితో నాగార్జున మరోసారి ఈ సీజన్ కు క్రేజ్ తీసుకు రానున్నారు.

ఇక బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వీక్ ఎలిమినేషన్ సంథింగ్ స్పెషల్ గా ఉంటాయని తెలుస్తుంది. ఆదివారం నాగార్జున ఎపిసోడ్ అయిపోతుంది అనగా మిడ్ వీక్ ఎలిమినేషన్ గురించి చెప్పారు. సో ఈ వారం నామినేషన్స్ లో ఉన్న ఆరుగురికి బిగ్ బాస్ షాక్ ఇవ్వనున్నారు. మిడ్ వీక్ లోనే ఒక కంటెస్టెంట్ ను హౌస్ నుంచి బయటకు పంపించే ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

ఐతే హోస్ట్ నాగార్జున ముందే హింట్ ఇచ్చారు కాబట్టి బుధ, గురువారాల్లో ఒక ఎలిమినేషన్ ఉంటుందని ఫిక్స్ అవ్వొచ్చు. అంతేకాదు మిడ్ వీక్ ఎలిమినేషన్ తో పాటుగా రెగ్యులర్ గా వీకెండ్ లో అంటే ఆదివారం జరిగే ఎలిమినేషన్ కూడా ఉంటుంది. సో అలా చూస్తే ఈ వారం రెండు ఎలిమినేషన్స్ ఉంటాయని తెలుస్తుంది.

బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వీకెండ్ ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని తెలుస్తుంది. వీకెండ్ లో కొత్త కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయని తెలుస్తుండగా రెండు ఎలిమినేషన్స్ ఆడియన్స్ కి షాక్ ఇవ్వనున్నాయి. ఇంతకీ ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వారిలో ఎలిమినేషన్ కత్తి ఎవరి మెడ మీద ఉంది అన్నది చూడాలి.

బిగ్ బాస్ సీజన్ 8 లో ఇప్పటివరకు నాలుగు సీజన్లు కాగా నలుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ఐతే సోనియా, అభయ్, శేఖర్ బాషా ఎలిమినేషన్ మాత్రం ఆడియన్స్ ఊహించలేదు. సోనియా మాత్రం నిఖిల్, పృధ్విల ఆట చెడగొడుతూ ఆడియన్స్ లో కొంత నెగిటివిటీ తెచ్చుకుంది. అందుకే ఆమెని ఆడియన్స్ ఎలిమినేట్ చేశారు.