Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 8 : ఆ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది..?

నిఖిల్ కి సోనియా సిగరెట్ ఆపేయొచ్చు కదరా నువ్వు సిగరెట్ ఆపేస్తే నువ్వు ఏది అడిగితే అది ఇస్తానని అన్నది.

By:  Tupaki Desk   |   10 Sep 2024 6:46 AM GMT
బిగ్ బాస్ 8 : ఆ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది..?
X

బిగ్ బాస్ హౌస్ లో ఇంతకుముందు పరిచయం లేని వ్యక్తులు హౌస్ లోకి రాగానే ఒకరితో ఒకరికి మంచి ఫ్రెండ్ షిప్ ఏర్పడుతుంది. అది కొందరికి స్ట్రాంగ్ రిలేషన్ షిప్ కూడా అవుతుంది. బిగ్ బాస్ ద్వారా మంచి ఫ్రెండ్స్ గా అయిన వారు చాలామంది ఉన్నారు. హౌస్ లో ఎంతమంది ఉన్నా సరే బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఒకరిని ఏర్పరచుకుంటారు. ఐతే అది ఒక మేల్ కంటెస్టెంట్ మరో ఫిమేల్ కంటెస్టెంట్ తో అయితే ఫ్రెండ్ షిప్ దాటి సంథింగ్ సంథింగ్ అనేస్తుంటారు. 7 సీజన్లలో ఇలాంటివి ఆడియన్స్ చాలా చూసేశారు.

ఐతే ఇలా చేసే వారు కేవలం ఆట కోసమే అనేట్టుగా కనిపిస్తారు. ఎవరో ఒకరు ముందు ఎలిమినేట్ అయిన తర్వాత.. లేదా హౌస్ నుంచి బయటకు వచ్చాక ఆ ఫ్రెండ్ షిప్ అంతా ఆట కోసమే అని ఒప్పేసుకుంటారు. లాస్ట్ సీజన్ లో రితిక పల్లవి ప్రశాంత్ తో ముందు క్లోజ్ గా ఉండి ఆ తర్వాత అతనికే రివర్స్ అయ్యింది. పల్లవి ప్రశాంత్ కి దూరమయ్యాక యావర్ తో ఆమె క్లోజ్ గా ఉంది. రితిక ఆడిన ఫ్రెండ్ షిప్ ఆట ఆడియన్స్ కు అర్ధమైంది కాబట్టే ఆమె రెండు సార్లు హౌస్ లోకి వచ్చినా ఆడియన్స్ బయటకు పంపించారు.

ఇక ఈ సీజన్ లో సోనియా కూడా అదే ఫార్ములా ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. వచ్చి రెండో వారం కూడా పూర్తి కాకముందే నిఖిల్ తో చాలా క్లోజ్ గా ఉంటుంది.సోనియా ఎక్కడ ఉంటే నిఖిల్ అక్కడ అనేలా కనిపిస్తుంది. ఇక ఈమధ్య వారి మధ్య మాటలు కూడా అనుమానాలకు దారి తీస్తున్నాయి. నిఖిల్ కి సోనియా సిగరెట్ ఆపేయొచ్చు కదరా నువ్వు సిగరెట్ ఆపేస్తే నువ్వు ఏది అడిగితే అది ఇస్తానని అన్నది. మరి ఆమె ఏం ఇవ్వాలని అనుకుందో తెలియదు కానీ కుర్రాడిని సిగరెట్ మానిపించడం కోసం సోనియా ఇచ్చిన ఆఫర్ ఆడియన్స్ కు షాక్ ఇచ్చింది.

ఈమె నిజంగానే నిఖిల్ కు దగ్గరైందా లేదా ఆట కోసమే స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి నిఖిల్ తో క్లోజ్ గా ఉంటుందా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా సోనియా గేం ప్లాన్ ఏంటన్నది తెలియదు కానీ ఆమె వల్ల నిఖిల్ బ్యాడ్ అవుతున్నాడు. నిఖిల్ ఇలానే సోనియాను వెనకేసుకుని వస్తే తప్పకుండా అతని ఆట మీద ఎఫెక్ట్ పడుతుంది. ఐతే ఇప్పటివరకు సోనియా ఆటల్లో తన స్టామినా చూపించలేదు. ఇప్పటివరకు ఒక్క టాస్క్ కూడా ఆమె గెలిచింది లేదు. మరి మిగతా హౌమెట్స్ కు పాయింట్ అవుట్ చేసే ఛాన్స్ ఇవ్వకుండా సోనియా ఆట మీద దృష్టి పెడుతుందా లేదా అన్నది చూడాలి.