బిగ్ బాస్ 8 : స్టార్ మా సీరియల్ పరివార్ తో బిగ్ బాస్ పరివార్ ఫైట్..!
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ పరివార్ గా ప్రభాకర్, ఆమని హౌస్ లోకి వచ్చి బిగ్ బాస్ టాప్ 5తో మాట్లాడి బెలూన్ బుట్టలో వేసుకునే టాస్క్ ఆడారు.
By: Tupaki Desk | 10 Dec 2024 9:58 AM GMTబిగ్ బాస్ సీజన్ 8 లో చివరి వారం ఎంతో ఎంటర్టైనింగ్ గా సాగుతుంది. మామూలుగా అయితే బిగ్ బాస్ హౌస్ లో మండే వచ్చింది అంటే నామినేషన్స్ హడావిడి ఉంటుంది. కానీ ఆల్రెడీ ఫైనల్ ఫైవ్ కి వచ్చిన వారికి అందులోనూ ఫైనల్ వీక్ కాబట్టి ఇక టాప్ 1 టు 5 ఎవరికి ఇవ్వాలో ఓట్ చేయడమే తప్ప మిగతాది ఏమి లేదు. ఐతే హౌస్ లో ఈ వారం కంటెస్టెంట్స్ ని ఎంటర్టైన్ చేస్తూ వారి ప్రైజ్ మనీని పెంచే ప్రయత్నం చేసేలా చూస్తున్నారు. అందులో భాగంగా స్టార్ మా సీరియల్ పరివార్ తో బిగ్ బాస్ పరివార్ కొన్ని టాస్కులు ఆడాల్సి ఉంటుంది. ఆ టాస్కులకు కొంత ప్రైజ్ మనీ యాడ్ అవుతుంది.
ఈ క్రమంలో మొదట నువ్వుంటేనే జతగా సీరియల్ హీరో అర్జున్ కళ్యాణ్, అనులు హౌస్ లోకి వెళ్లారు. వారిద్దరు నబీల్, ప్రేరణతో కలిసి ఒక టాస్క్ ఆడారు. ఈ టాస్క్ లో నబీల్, ప్రేరణ గెలవగా ఆ టాస్క్ కు కేటాయించిన 12489 ప్రైజ్ మనీకి యాడ్ అయ్యాయి. ఆ తర్వాత అవినాష్ మరోసారి తన టాలెంట్ చూపిస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశాడు. ఆ తర్వాత ప్రభాకర్, ఆమని హౌస్ లోకి వచ్చారు.
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ పరివార్ గా ప్రభాకర్, ఆమని హౌస్ లోకి వచ్చి బిగ్ బాస్ టాప్ 5తో మాట్లాడి బెలూన్ బుట్టలో వేసుకునే టాస్క్ ఆడారు. ఈ టాస్క్ లో కూడా బిగ్ బాస్ పరివార్ గెలిచి 15111 రూపాయలు ప్రైజ్ మనీకి యాడ్ అయ్యేలా చేశారు. ఐతే మధ్యలో ఫ్రీ టైం లో కంటెస్టెంట్స్ హైడ్ అండ్ సీక్ ఆడారు. దాక్కోవడం కోసం అవినాష్ యాక్షన్ రూమ్ కు వెళ్లాడు. అతను వెళ్లింది తెలిసి బిగ్ బాస్ కావాలని లైట్స్ ఆపేసి గజ్జల సౌండ్స్ చేయిస్తూ కాస్త ఎంటర్టైన్ చేశాడు. అవినాష్ యాక్షన్ రూంలో ఉన్న వీడియోని లివింగ్ ఏరియాలో ఉన్న కంటెస్టెంట్స్ చూసి తెగ నవ్వుకున్నారు.
మొత్తానికి టాప్ 5 ఈ వారం ఎలాంటి గొడవలు లేకుండా హౌస్ లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక సీజన్ టైటిల్ విన్నర్ గా నిఖిల్, గౌతం ల మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది. ఈ ఇద్దరిలో ఎవరు విజేత అవుతారన్నది సస్పెన్స్ గా ఉంది.