Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 8 : షాకింగ్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరికి లక్..!

ఐతే హరితేజ కానీ లేదా గౌతం కానీ అసలైతే ఓటింగ్ ప్రకారం ఎలిమినేట్ అవ్వాల్సి ఉంది. కానీ బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం షాకింగ్ ఎలిమినేషన్ జరుగుతుంది.

By:  Tupaki Desk   |   20 Oct 2024 5:52 AM GMT
బిగ్ బాస్ 8 : షాకింగ్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరికి లక్..!
X

బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం షాకింగ్ ఎలిమినేషన్ జరగబోతుంది. ఈ వారం నామినేషన్స్ లో ఉన్న 9 మందిలో శనివారం ఎపిసోడ్ లో ప్రేరణ, తేజ సేవ్ అయ్యారు. అంటే ఇంకా నామినేషన్స్ లో ఏడుగురు ఉన్నారు. వారిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది చూడాలి. ఐతే శనివారం ఎపిసోడ్ లో మణికంఠ తాను హౌస్ నుంచి బయటకు వెళ్లేందుకు సిద్ధమని హోస్ట్ నాగార్జునతో చెప్పాడు. తనకు హెల్త్ సహకరించట్లేదని.. టాస్కులు సరిగా ఆడలేకపోతున్నా అని చెప్పాడు మణికంఠ. తను ఇన్ని వారాలు ఉన్నందుకు చాలని వెళ్లిపోతానని అన్నాడు.

అందుకు నాగార్జున ఆడియన్స్ ఓట్లను బట్టి ఎలిమినేషన్ ఉంటుందని చెప్పారు. ఐతే ఈ వారం ఓటింగ్ ని బట్టి చూస్తే మణికంఠ సేఫ్ పొజిషన్ లోనే ఉన్నాడని తెలుస్తుంది. గౌతం, హరితేజ ఈ ఇద్దరు లీస్ట్ ఓటింగ్ తో ఉన్నారు. ఐతే హరితేజ కానీ లేదా గౌతం కానీ అసలైతే ఓటింగ్ ప్రకారం ఎలిమినేట్ అవ్వాల్సి ఉంది. కానీ బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం షాకింగ్ ఎలిమినేషన్ జరుగుతుంది.

లీస్ట్ లో ఉన్న ఈ ఇద్దరు కాకుండా మణికంఠని హౌస్ నుంచి బయటకు పంపించేస్తున్నారని తెలుస్తుంది. ఆల్రెడీ ఎలిమినేషన్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తి కాగా అక్కడ నుంచి వస్తున్న లీక్స్ ప్రకారం మణికంఠ ఎలిమినేషన్ పూర్తైంది. గౌతం, హరితేజ ఈ ఇద్దరు లీస్ట్ ఓటింగ్ లో ఉన్నా కూడా మణికంఠ ఎలిమినేషన్ తో ఈ ఇద్దరు సేవ్ అవుతున్నారు. ఇక గౌతం ఈ వారం మెగా చీఫ్ గా గెలిచాడు కాబట్టి అతనికి ఈ వారం ఇమ్యునిటీ వస్తుంది.

సో మణికంఠ తీసుకున్న నిర్ణయం వల్ల గౌతం రెండు వారాలు సేఫ్ అవ్వగా హరితేజ ఒక వారం సేఫ్ అయ్యింది. మొదటి వారం నుంచి మణికంఠ తన కన్ ఫ్యూజింగ్ పర్సనాలిటీతో హౌస్ మేట్స్ ని కన్ఫ్యూజ్ చేశాడు. ఇప్పుడిప్పుడే పర్వాలేదు అనుకున్న టైం లో మళ్లీ మొదటికి వచ్చేశాడు. హోస్ట్ నాగార్జున తోనే అతను నేనేమి చేయలేకపోతున్నా నన్ను పంపించేయండి అనడం బట్టి చూస్తే మణికంఠ విషయంలో ఏం జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చు. మరి మణికంఠ ఎలిమినేషన్ ప్రక్రియ అతని ఫాలోవర్స్ కు ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ కాస్త స్ట్రాంగ్ గా ఉంటే మణి కూడా టాప్ 5లో ఉండే వాడని చెప్పొచ్చు.