బిగ్ బాస్ 8 : ప్రైజ్ మనీకి ఈక్వల్ గా విష్ణు ప్రియ రెమ్యూనరేషన్..?
ఆమెకు వారానికి 4 లక్షల చొప్పున అగ్రిమెంట్ తో హౌస్ లోకి పంపించారు. 14 వారాలు హౌస్ లో ఉన్నందుకు 56 లక్షల దాకా ఆమె రెమ్యునరేషన్ గా పొందుతుంది.
By: Tupaki Desk | 11 Dec 2024 3:45 AM GMTబిగ్ బాస్ సీజన్ 8 లో లాస్ట్ వీకెండ్ ఇద్దరిని ఎలిమినేట్ చేసి ఆడియన్స్ షాక్ అయ్యేలా చేశాడు బిగ్ బాస్. ఈ సీజన్ టాప్ 5 ఎవరెవరు ఉంటారా అన్న దానికి పర్ఫెక్ట్ ఆన్సర్ ఇస్తూ హౌస్ లో ఫైట్లు, మాటలు, ఆటలు ఆడిన వారినే టాప్ 5 కి ఛాన్స్ ఇచ్చారు ఆడియన్స్. ఐతే శనివారం రోహిణి, ఆదివారం విష్ణు ప్రియ ఎలిమినేట్ అవ్వగా ఆమె రెమ్యునరేషన్ గురించి సర్వత్రా చర్చ మొదలైంది. విష్ణు ప్రియ ఒక సక్సెస్ ఫుల్ యాంకర్. ఆమె ఈ సీజన్ లోకి వస్తున్నప్పుడే విన్నర్ అయ్యే క్వాలిటీస్ అన్ని ఉన్నాయని అనుకున్నారు.
ఫైనల్ వీక్ కి ఒక వారం ముందు విష్ణు ప్రియ ఎలిమినేట్ అయ్యింది. అది కూడా ఆమె ఆట సరిగా ఆడకపోయినా సరే ఇన్నాళ్లు సర్వైవ్ అయ్యింది. పృధ్వితో పులిహోర కలపడం తప్ప విష్ణు ప్రియ పెద్దగా ఆడింది ఏమి లేదు. అయినా కూడా ఆమె ఫైనల్ వీక్ ముందు వారం అంటే 14 వారాల దాకా హౌస్ లో ఉంది. అదే ఇంకాస్త సీరియస్ గా ఆడి ఉంటే టైటిల్ విన్నర్ అయ్యేది. అయినా కూడా విష్ణు ప్రియకు బాగానే వర్క్ అవుట్ అయినట్టు అనిపిస్తుంది.
బిగ్ బాస్ సీజన్ 8 లో అందరి కన్నా హైయెస్ట్ రెమ్యునరేషన్ విష్ణు ప్రియకే అని తెలుస్తుంది. ఆమెకు వారానికి 4 లక్షల చొప్పున అగ్రిమెంట్ తో హౌస్ లోకి పంపించారు. 14 వారాలు హౌస్ లో ఉన్నందుకు 56 లక్షల దాకా ఆమె రెమ్యునరేషన్ గా పొందుతుంది. ఇది దాదాపు బిగ్ బాస్ టైటిల్ గెలిచిన వారి ప్రైజ్ మనీతో సమానం. బిగ్ బాస్ సీజన్ 8 లో హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ ని అందుకుంది విష్ణు ప్రియ.
హౌస్ లో ఎప్పుడు చూసినా పృధ్వితో కలిసి ఉండటం అతనికి సేవలు చేయడం తప్ప ఆమె చేసింది ఏమి లేదు. అదేదో వెకేషన్ కి వచ్చినట్టుగా విష్ణు ప్రియ ఉంది. అసలు ఆమె 14 వారాల దాకా హౌస్ లో ఎలా ఉందో ఆడియన్స్ కు అర్ధం కాలేదు. బయట ఉన్న తన ఫాలోయింగ్ వల్లే అన్ని వారాలు సర్వైవ్ అయ్యింది. అదే ఇంకాస్త ఆట ఆడి ఉంటే కచ్చితంగా టైటిల్ గెలిచే అవకాశం ఉండేదని చెప్పొచ్చు. ఐతే విష్ణు ప్రియ మాత్రం తాను కంటెంట్ ఇచ్చాను కాబట్టే ఇన్ని వారాలు ఉన్నా లేదంటే ఐదారు వారాలకే ఆడియన్స్ తనని పంపించే వారని చెప్పుకొచ్చింది.