బిగ్ బాస్ 8 : ఫైనల్స్ కి చీఫ్ గెస్ట్ ఎవరంటే..?
ఐతే ఈసారి ఈ ఫైనల్ రిజల్ట్స్ రాం చరణ్ అనౌన్స్ చేయనున్నారు. ఎవరైతే టాప్ 2 లో ఉంటారో వారిద్దరిలో ఒకరి చేయిని రాం చరణ్ పైకి ఎత్తుతారు.
By: Tupaki Desk | 15 Dec 2024 6:10 AM GMTబిగ్ బాస్ సీజన్ 8 ఫైనల్ డేకి చేరుకుంది. ఈ సీజన్ అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అంటూ ఆడియన్స్ కు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అందించారు. ప్రస్తుతం హౌస్ లో ఐదుగురు హౌస్ మెట్స్ ఉన్నారు. వారిలో టాప్ 2 ఎవరు. ఫైనల్ గా ఈ సీజన్ టైటిల్ విజేత ఎవరన్నది మరికొద్ది గంటల్లో తెలుస్తుంది. ఐతే ఈ ఫైనల్ ఎపిసోడ్ కి చీఫ్ గెస్ట్ గా గ్లోబల్ స్టార్ రాం చరణ్ ని ఆహ్వానించినట్టు తెలుస్తుంది. సీజన్ 8 ఫైనల్ ఎపిసోడ్ కి చరణ్ గెస్ట్ గా రాబోతున్నారు.
అంతకుముందు సినిమా ప్రమోషన్స్ కోసం బిగ్ బాస్ షోకి వచ్చిన చరణ్ ఇప్పుడు ఫైనల్ ఎపిసోడ్ కి గెస్ట్ గా వస్తున్నాడు. అందుకే సీజన్ 8 ఫైనల్ ఎపిసోడ్ కి సెపరేట్ క్రేజ్ ఏర్పడింది. ఇక 105 రోజులు హౌస్ లో ఉన్న బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్స్ లో టాప్ 2 ని ఉంచి అంటే మిగతా ముగ్గురిని హౌస్ నుంచి బయటకు తీసుకొస్తారు. ఫైనల్ గా ఇద్దరిలో ఒకరిని విజేతగా అనౌన్స్ చేస్తారు.
ఐతే ఈసారి ఈ ఫైనల్ రిజల్ట్స్ రాం చరణ్ అనౌన్స్ చేయనున్నారు. ఎవరైతే టాప్ 2 లో ఉంటారో వారిద్దరిలో ఒకరి చేయిని రాం చరణ్ పైకి ఎత్తుతారు. బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ అయిన వారికి 55 లక్షల క్యాష్ ప్రైజ్ తో పాటుగా సుజుకి బ్రీజా కార్ కూడా వస్తుంది. ప్రస్తుతం టాప్ 5 లో నిఖిల్, గౌతం, నబీల్, ప్రేరణ, అవినాష్ ఉన్నారు. వీరిలో నిఖిల్, గౌతం ల మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది. ఫైనల్ విన్నర్ ఎవరన్నది మరికొద్ది గంటల్లో తెలుస్తుంది.
చరణ్ విషయానికి వస్తే ప్రస్తుతం తను నటించిన గేం ఛేంజర్ రిలీజ్ కు రెడీగా ఉంది. 2025 జనవరి 10న గేమ్ ఛేంజర్ రిలీజ్ లాక్ చేశారు. బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ లో తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే వచ్చినట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో ఉపేంద్ర కూడా తన UI సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్నారని తెలుస్తుంది. సో టైటిల్ విన్నర్ ఎవరైనా సరే సీజన్ 8 టైటిల్ విన్నర్ షీల్డ్ ని చరణ్ చేత అందుకోబోతున్నారని తెలుస్తుంది.