Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 8 ఆట మొదలైంది.. ఫస్ట్ ఎపిసోడ్ తోనే హౌస్ మెట్స్ కి షాక్..!

మొదటి కంటెస్టెంట్ గా యష్మి స్టేజ్ మీదకు రాగా ఆమెకి జోడీగా నిఖిల్ ని జత చేశారు.

By:  sanjesh   |   2 Sep 2024 6:04 AM GMT
బిగ్ బాస్ 8 ఆట మొదలైంది.. ఫస్ట్ ఎపిసోడ్ తోనే హౌస్ మెట్స్ కి షాక్..!
X

బిగ్ బాస్ సీజన్ 8 మొదలైంది. 14 మంది కంటెస్టెంట్స్ తో ఈ సీజన్ ప్రారంభమైంది. కొన్నాళ్లుగా బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే ఈ సీజన్ లో కొంతమంది తెలిసిన వారు కాగా మరికొంతమంది మాత్రం ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని వారిని తీసుకొచ్చారు. బిగ్ బాస్ సీజన్ 8 హోస్ట్ గా కింగ్ నాగార్జున ఎంట్రీ అదిరిపోయింది.


ఈసారి హౌస్ లోకి కంటెస్టెంట్స్ ని ఒక్కొక్కరిగా కాకుండా కొత్తగా పెయిర్స్ గా పంపించారు నాగార్జున. మొదటి కంటెస్టెంట్ గా యష్మి స్టేజ్ మీదకు రాగా ఆమెకి జోడీగా నిఖిల్ ని జత చేశారు.ఇద్దరు కలిసి హౌస్ లోకి పంపించారు.ఇక తర్వాత వచ్చిన కంటెస్టెంట్ అభయ్ నవీన్. అతనికి పెయిర్ గా సీరియల్ యాక్టర్ ప్రేరణని ఇచ్చి హౌస్ లోకి పంపించారు.


బిగ్ బాస్ సీజన్ 8 లో థర్డ్ పెయిర్ గా ఆదిత్య ఓం, సోనియా వచ్చారు. ఆదిత్య ఓం ఒకప్పటి హీరో కం డైరెక్టర్ కాగా ఆఫ్టర్ లాంగ్ టైం మళ్లీ తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు బిగ్ బాస్ కి వచ్చారు. సోనియా కూడా నటిగా కొనసాగుతున్న ఆమె బిగ్ బాస్ ద్వారా మరింత మంది ప్రేక్షకుల దగ్గరకు చేరువవ్వాలని వచ్చారు.


బిగ్ బాస్ సీజన్ 8 లో నాలుగో పెయిర్ గా బెజవాడ బేబక్క, శేఖర్ బాషా వచ్చారు. సోషల్ మీడియా సెలబ్రిటీ అయిన బెజవాడ బేబక్క ఆర్ జే శేఖర్ బాషా ఇద్దరు సోషల్ మీడియాలో అందరికీ తెలిసిన వారే. ఈ ఇద్దరు కూడా కలిసి హౌస్ లోకి వెళ్లారు.


ఈ సీజన్ లో ఐదవ పెయిర్ గా కిర్రాక్ సీత, నాగ మణికంఠ వచ్చారు. సినిమాల్లో సైడ్ రోల్స్ చేస్తున్న కిరాక్ సీత, సీరియల్స్ లో నటిస్తున్న నాగ మణికంఠ కలిసి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.


బిగ్ బాస్ 8 లో ఆరో పెయిర్ గా పృధ్వి రాజ్ విష్ణు ప్రియ వచ్చారు. కన్నడ సీరియల్ నటుడైన పృధ్విరాజ్ తెలుగు సీరియల్స్ కూడా చేశాడు. ఇక విష్ణు ప్రియ యాంకర్ గా తన ప్రయాణం తెలిసిందే. ఇద్దరు బిగ్ బాస్ సీజన్ 8 లోకి పెయిర్ గా వచ్చారు.


ఇక సీజన్ 8 లో చివరి పెయిర్ గా నైనికా, నబీల్ అఫ్రిది వచ్చారు. డాన్సర్ గా సుపరిచితురాలైన నైనిక తో వరంగల్ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ నబీల్ కలిసి హౌస్ లోకి వచ్చారు.


ఈ సీజన్ మొదటి ఎపిసోడ్ నుంచే ట్విస్టులు ఇవ్వడం మొదలు పెట్టాడు బిగ్ బాస్. వచ్చిన ప్రతి రెండు జంటలకు ఒక టాస్క్ ఇచ్చి గెలిచిన వారికి ఒక సర్ ప్రైజ్ ఓడిన వారికి ఒక బ్యాడ్ న్యూస్ చెబుతూ వచ్చారు. అలా మొదటి ఎపిసోడ్ టాస్కులు ఓడిపోవడం వల్ల ఈ సీజన్ మొత్తం కెప్టెన్ లేకుండానే షో నడుస్తుందని చెప్పారు హోస్ట్ నాగార్జున. అంటే సీజన్ 8 లో కెప్టెన్ అని ఎవరు ఉండరు. అంతేకాదు దాంతో వచ్చే ఇమ్యునిటీ కూడా ఉండదు.

ఇక రెండో బ్యాడ్ న్యూస్ గా ఇంటి రేషన్ ని కట్ చేశారు. తన రేషన్ ని లిమిట్ లెస్ గా హౌస్ మెట్స్ టాస్కులు ఆడి గెలుచుకోవాల్సి ఉంటుంది. ఇలా ఆట మొదలు పెట్టిన రోజే హౌస్ మెట్స్ కి బ్యాడ్ న్యూస్ లు చెప్పి షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇదే కాదు ప్రైజ్ మనీ కూడా ప్రస్తుతానికి జీరో అని దాన్ని లిమిట్ లెస్ గా పెంచుకునే అవకాశం హౌస్ మెట్స్ కి ఉందని చెప్పి షాక్ ఇచ్చారు బిగ్ బాస్.

మొత్తానికి బిగ్ బాస్ 8 లిమిట్ లెస్ ఎంటర్టైన్ మెంట్, ఎంజాయ్ మెంట్ అని చెప్పి ఫస్ట్ రోజే కంటెస్టెంట్స్ కి ట్విస్టులు ఇచ్చాడు బిగ్ బాస్.