Begin typing your search above and press return to search.

8.. 18.. విన్నర్ల ట్విస్ట్ ఇదే..!

బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో పూర్తి కాగా నిన్న ఆదివారం బిగ్ బాస్ సీజన్ 8 తమిళ్, సీజన్ 18 హిందీలో పూర్తయ్యాయి.

By:  Tupaki Desk   |   20 Jan 2025 10:14 AM GMT
8.. 18.. విన్నర్ల ట్విస్ట్ ఇదే..!
X

బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో పూర్తి కాగా నిన్న ఆదివారం బిగ్ బాస్ సీజన్ 8 తమిళ్, సీజన్ 18 హిందీలో పూర్తయ్యాయి. ఆదివారం ఫైనల్ ఎపిసోడ్ ఎంతో గ్రాండ్ గా జరిగాయి. జనవరి 19న రెండు భాషల్లో బిగ్ బాస్ షో ఫైనల్ ఎపిసోడ్ జరగడం సంథింగ్ స్పెషల్ అని చెప్పొచ్చు. బిగ్ బాస్ తమిళ్ సీజన్ 8 విన్నర్ గా యూట్యూబర్ ముత్తు కుమారన్ విజేతగా నిలిచాడు. అతనికి 41 లక్షల ప్రైజ్ మనీ వచ్చింది. తమిళ్ సీజన్ 8 లో రన్నరప్ గా వీజే విశాల్ నిలిచాడు. బిగ్ బాస్ సీజన్ 8ని విజయ్ సేతుపతి హోస్ట్ గా చేశారు.

బిగ్ బాస్ తమిళ్ ని లాస్ట్ సీజన్ వరకు లోకనాయకుడు కమల్ హాసన్ హోస్ట్ గా చేశారు. సీజన్ 8 నుంచి విజయ్ సేతుపతి హోస్ట్ గా చేసి మెప్పించారు. హోస్టింగ్ మొదటిసారే అయినా కంటెస్టెంట్స్ ని పర్ఫెక్ట్ గా మ్యానేజ్ చేస్తూ వచ్చారు విజయ్ సేతుపతి. ఇక హిందీ విషయానికి వస్తే అక్కడ సీజన్ 18 విన్నర్ గా యాక్టర్ కరణ్ వెర్ మెహ్రా విజేతగా నిలిచాడు. ఇతనికి 50 లక్షల ప్రైజ్ మనీ అందించారు. ఇక అతనితో పాటు వివియన్ డ్సేన ఫస్ట్ రన్నరప్ కాగా యూట్యూబర్ రజత్ దలాల్ మరో రన్నరప్ గా నిలిచాడు.

ఇదే కాదు కరణ్ మెహ్రా ఇదివరకు ఖత్రోన్ కె ఖిలాడి సీజన్ 14లో కూడా విన్నర్ గా నిలిచాడు. సీరియల్ యాక్టర్ గా సూపర్ పాపులర్ అయిన కరన్ మెహ్రా బిగ్ బాస్ సీజన్ 18లో మొదటి వారం నుంచి తన మార్క్ ఆట ఆడుతూ వచ్చాడు. తమిళ్ లో సీజన్ 8, హిందీలో సీజన్ 18 ఇలా రెండు సీజన్లు పూర్తి చేసుకుని బిగ్ బాస్ ఆడియన్స్ ని సూపర్ ఎంటర్టైన్ చేశారు.

తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఎప్పుడో పూర్తి కాగా బిగ్ బాస్ తెలుగు నాన్ స్టాప్ త్వరలో మొదలవుతుందని అంటున్నారు. అసలైతే ఫిబ్రవరి, మార్చిలో ఈ సీజన్ ఉంటుందని టాక్ వినిపిస్తుంది. బిగ్ బాస్ సీజన్ 9 మాత్రం ఈసారి త్వరగానే జూన్ లేదా జూలైలో మొదలు పెట్టే ఏర్పాట్లలో ఉన్నట్టు తెలుస్తుంది.