షాకిస్తున్న బిగ్ బాస్ హోస్ట్ ప్యాకేజీ
బిగ్ బాస్ తాజా ఎపిసోడ్‌ల కోసం ప్రేక్షకుల ఎదురుచూపుల గురించి మనకు స్పష్ఠమైన అవగాహన ఉంది.
By: Tupaki Desk | 15 Sep 2024 6:24 AM GMTబిగ్ బాస్ తాజా ఎపిసోడ్‌ల కోసం ప్రేక్షకుల ఎదురుచూపుల గురించి మనకు స్పష్ఠమైన అవగాహన ఉంది. సాంప్రదాయ వాదులకు నచ్చకపోయినా మాస్ ఆదరణ పొందడంలో బిగ్ బాస్ రియాలిటీ షో ఎప్పుడూ విఫలం కాలేదు. నాగార్జున హోస్ట్ గా తెలుగు బిగ్ బాస్ ఇప్పటికే ఎయిర్ లో ఉంది. ఇంతలోనే ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ తమిళ్ ఎనిమిదో సీజన్ గురించి ఇటీవల చర్చ సాగుతోంది. ఈ సంవత్సరం అక్టోబరు తొలి వారంలో విజయ్ టీవీ - డిస్నీ+ హాట్‌స్టార్‌లలో కొత్త సీజన్‌ని చూడాలని అభిమానులు వేచి చూస్తున్నారు. ఈ సీజన్ పరివర్తన సీజన్ అన్న చర్చ సాగుతోంది. ఇప్పటి వరకు ఈ షోను హోస్ట్ చేస్తున్న విశ్వనటుడు కమల్ హాసన్ టీఆర్పీ ఏమాత్రం తగ్గకుండా కొనసాగించడంలో విజయం సాధించారు. అయితే ఇకపై అతడు ఈ షోని హోస్ట్ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఒప్పందాలు పూర్తయ్యాయని తెలుస్తోంది.
బిగ్ బాస్ తమిళ్‌ను ఏడు సీజన్‌ల పాటు హోస్ట్ చేసిన తర్వాత కమల్ హాసన్ ఈ కార్యక్రమం నుంచి నిష్కృమిస్తున్నారు. తదుపరి ప్రేక్షకులు ఇంకా ఎవరిని చూస్తారనే దానిపై అభిమానులను కళ్లకు కాయలు కాసేలా వేచి చూస్తున్నారు. కొత్త హోస్ట్ గురించి తమిళనాడు వ్యాప్తంగా చర్చ సాగుతోంది. అయితే ఈసారి కొత్త సీజన్ కి విజయ్ సేతుపతి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ప్రేక్షకులకు ఈ విషయాన్ని తెలియజేసే ప్రత్యేక టీజర్ విడుదలైంది. బహుముఖ ప్రజ్ఞావంతుడైన సేతుపతి రాకతో బిగ్ బాస్ కి కొత్త కళ వచ్చిందని సదరు చానెల్ భావిస్తోంది.
విజయ్ సేతుపతి బిగ్ బాస్ తమిళ్ కొత్త సీజన్ కోసం ఎంత ప్యాకేజీ అందుకుంటున్నారు? అన్న చర్చ కూడా ఇప్పుడు తెరపైకొచ్చింది. అయితే బిగ్ బాస్ తమిళ్- ఏడవ సీజన్‌ను హోస్ట్ చేస్తున్నప్పుడు కమల్ హాసన్ రూ. 130 కోట్లతో తనను తాను సంతృప్తి పరచుకున్నాడు. సీజన్ 8 కోసం సేతుపతికి ఇందులో సగం పారితోషికం ఇస్తారని తెలుస్తోంది. విజయ్ సేతుపతి రూ. 60 కోట్లు వసూలు చేస్తారని పరిశ్రమ వర్గాలు ధృవీకరించాయి. మొత్తం వంద రోజుల సీజన్‌లో సేతుపతి వారాంతాల్లో మాత్రమే తెరపై కనిపిస్తారు.
అయితే ఫీజులో వ్యత్సాసం గురించి కోలీవుడ్ లో చర్చ సాగుతోంది. హోస్ట్ మారాక కొత్త సీజన్ ఎలా ఉంటుందో చూడాలన్న కుతూహాలం అందరిలో ఉంది. విజయ్ సేతుపతి తో కొత్త సీజన్ పై అంచనాలు భారీగా పెరిగాయి. బిగ్ బాస్ తమిళ్ 8 రిహార్సల్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నందున వీక్షకులు తమ రోజువారీ వినోదం ఎలా ఉంటుందనే దానిపై ఇప్పటికే ఉత్సాహంగా ఉన్నారు.