Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 8 : మణికంఠ ఇలా అయితే కష్టమే..!

బిగ్ బాస్ సీజన్ 8 లో మణికంఠ ఎంట్రీ అందరిని సర్ ప్రైజ్ చేసింది. అతను వస్తాడని ఎవరు ఊహించలేదు.

By:  Tupaki Desk   |   19 Sep 2024 12:30 PM GMT
బిగ్ బాస్ 8 : మణికంఠ ఇలా అయితే కష్టమే..!
X

బిగ్ బాస్ సీజన్ 8 లో మణికంఠ ఎంట్రీ అందరిని సర్ ప్రైజ్ చేసింది. అతను వస్తాడని ఎవరు ఊహించలేదు. సీరియల్స్ లో నటించిన నాగ మణికంఠ బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ గా వచ్చే టైం లో ఏవీతోనే తన కష్టాల గురించి చెప్పాడు. భార్య ఒక పాప ఉండగా అమెరికా నుంచి వచ్చేశానని చెప్పాడు. ఐతే నెక్స్ట్ ఏం జరిగిందో హౌస్ లో చూస్తారని అన్నాడు. ఇక వచ్చీ రాగానే తనకున్న కష్టాలన్నీ చెప్పుకుని తను ఏడ్చి హౌస్ మెట్స్ ని ఏడిపించాడు.

అంతేకాదు నిఖిల్, సీతలకు తన బాధ చెబుతూ విగ్ కూడా తీసేశాడు. బిగ్ బాస్ కన్ఫెషన్ రూం లోకి పిలిచి కన్సోల్ చేయాలని చూసినా అక్కడ వింత వింతగా ప్రవర్తించాడు. ఆ టైం లోనే బిగ్ బాస్ కు మణికంఠ అర్హుడు కాదని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. ఐతే ఆ వారం నామినేషన్స్ లో ఉన్నా సింపతీ వల్ల సేఫ్ అయ్యాడు. రెండో వారం కూడా అదే సింపతీ వర్క్ అవుట్ అయ్యింది.

ఇక మూడో వారం లో కూడా మళ్లీ అదే సింపతీ కార్డ్ వాడుతున్నాడు మణికంఠ. ప్రభావతి 2.ఓ టాస్క్ లో మణికంఠ కింద పడటం వల్ల ఆ క్లాన్ చీఫ్ కొద్దిసేపు ఆగు తర్వాత ఆటలో జాయిన్ అవ్వమని చెప్పాడు. దానికి మణికంఠ హర్ట్ అయ్యాడు. బెడ్ రూం లోకి వెళ్లి గోడకు ఆనుకుని ఏడ్చాడు. అభయ్ వెళ్లి సర్ధి చెప్పాలని చూశాడు. నీ కోసం బయట భార్యా పాపా ఉన్నారని అంటే నాకు ఎవరు లేరు బిగ్ బాస్ కప్ కొడితేనే వాళ్లు నా దగ్గరకు వసారని ఏడ్చాడు.

ఇదంతా కూడా మణికంఠ కావాలని చేస్తున్నాడని కొందరు అంటున్నా. బయట తనకు ఎలాంటి రెస్పెక్ట్ లేదు బిగ్ బాస్ విజేతగా తన సత్తా చాటాలని చూస్తున్నాడని కొందరు చెప్పుకుంటున్నారు. ఐతే ప్రతిసారీ తన ఎమోషనల్ బ్యాక్ స్టోరీ చెప్పడం వల్ల ఆడియన్స్ లో అతని మీద ఒక రకమైన అభిప్రాయం ఏర్పడింది. మరి బిగ్ బాస్ సీజన్ 8 లో మణికంఠ ప్రయాణం ఎంతవరకు అన్నది తెలియదు కానీ అతను ఈ సింపతీ గెయిన్ కాకుండా ఆట మీద దృష్టి పెడితే బెటర్ అని ఆడియన్స్ కోరుతున్నారు.