Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ నాన్ స్టాప్ పరిస్థితి ఏంటి..?

ఐతే బిగ్ బాస్ సీజన్ 9 కి ముందే బిగ్ బాస్ ఆడియన్స్ కోసం నాన్ స్టాప్ ని తెచ్చే ప్లానింగ్ లో ఉన్నారు.

By:  Tupaki Desk   |   4 Feb 2025 8:30 PM GMT
బిగ్ బాస్ నాన్ స్టాప్ పరిస్థితి ఏంటి..?
X

బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగులో 8 సీజన్లను పూర్తి చేసుకుంది. లాస్ట్ డిసెంబర్ లో బిగ్ బాస్ సీజన్ 8 పూర్తి కాగా ఈ సీజన్ లో స్టార్ మా సీరియల్ యాక్టర్ నిఖిల్ మలియక్కల్ టైటిల్ విన్నర్ గా నిలిచాడు. బిగ్ బాస్ సీజన్ 8 అయిపోయింది.. సీజన్ 9 కి చాలా టైం ఉంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కూడా ఈసారి సెప్టెంబర్ లోనే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఐతే బిగ్ బాస్ సీజన్ 9 కి ముందే బిగ్ బాస్ ఆడియన్స్ కోసం నాన్ స్టాప్ ని తెచ్చే ప్లానింగ్ లో ఉన్నారు.

బిగ్ బాస్ 24/7 అదే బిగ్ బాస్ నాన్ స్టాప్ ఆల్రెడీ మొదటి సీజన్ జరిగింది. కింగ్ నాగార్జున హోస్ట్ గానే ఆ సీజన్ జరగ్గా బింధు మాధవి నాన్ స్టాప్ సీజన్ విన్నర్ గా నిలిచింది. ఐతే లాస్ట్ ఇయరే బిగ్ బాస్ నాన్ స్టాప్ రెండో సీజన్ వస్తుందని వార్తలు వచ్చాయి. కానీ అది జరగలేదు. బిగ్ బాస్ నాన్ స్టాప్ అదే 24/7 రెండో సీజన్ ఈసారి తప్పకుండా ఉంటుందని చెబుతున్నారు.

సీజన్ 8 ముగింపు టైం లోనే బిగ్ బాస్ టీం ఈసారి బిగ్ బాస్ నాన్ స్టాప్ త్వరగానే మొదలు పెట్టాలని అనుకున్నారట. ఐతే టీం అంతా కూడా ఫిక్స్ అయినా ఇంకా ఎందుకో లేట్ చేస్తున్నారని తెలుస్తుంది. అసలైతే బిగ్ బాస్ నాన్ స్టాప్ రెండో సీజన్ ఈ ఫిబ్రవరి రెండో వారం నుంచి మొదలు పెట్టాల్సి ఉంది. ఐతే ఇప్పటివరకు బిగ్ బాస్ హౌస్ సెటప్ ని ఇంకా మార్చలేదని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 8 సెట్ లోనే బిగ్ బాస్ నాన్ స్టాప్ కి సంబందించిన సెటప్ అంతా చేయాల్సి ఉంది. కానీ అది ఇంకా పూర్తి కాలేదట.

ముందు సీజన్లతో పోలిస్తే బిగ్ బాస్ సీజన్ 8 ఓటీటీలో వీక్షణలు ఎక్కువ జరిగాయి. ముఖ్యంగా డిస్నీ సబ్ స్క్రైబర్స్ కి ఎలాంటి యాడ్స్ లేకుండా బిగ్ బాస్ రావడం వల్ల ఓటీటీలోనే ఎపిసోడ్ చూసేస్తున్నారు. అందుకే ఈసారి బిగ్ బాస్ నాన్ స్టాప్ తప్పకుండా ఆడియన్స్ ఎంగేజ్ చేసేలా ఉంటుందని అంటున్నారు. బిగ్ బాస్ నాన్ స్టాప్ రెండో సీజన్ ఎప్పుడు వస్తుందా అని బిగ్ బాస్ లవర్స్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు. మరి ఈ సీజన్ విషయంలో అప్డేట్ ఏంటన్నది తెలియాల్సి ఉంది. సీజన్ 2 నాన్ స్టాప్ కి కూడా నాగార్జున హోస్ట్ గా చేస్తారని తెలుస్తుంది. ఐతే బిగ్ బాస్ నాన్ స్టాప్ ఈ సీజన్ లో అంతా కొత్త కంటెస్టెంట్స్ ఉంటారని తెలుస్తుంది.