బిగ్ బాస్ ఫ్యాన్స్ కి సూపర్ న్యూస్.. బిబి నాన్ స్టాప్ 2 ప్లాన్ ఫిక్స్..
బిగ్ బాస్ సీజన్ 8 ముగుస్తుంది కదా అని బాధపడుతున్న బీబీ ఫ్యాన్స్ కి ఒక సూపర్ అప్డేట్ వచ్చింది.
By: Tupaki Desk | 12 Dec 2024 1:00 PM GMTబిగ్ బాస్ సీజన్ 8 ముగుస్తుంది కదా అని బాధపడుతున్న బీబీ ఫ్యాన్స్ కి ఒక సూపర్ అప్డేట్ వచ్చింది. బిగ్ బాస్ ఆడియన్స్ కోసం ఈసారి బీబీ నాన్ స్టాప్ రెండో సీజన్ రెడీ చేస్తున్నారు. బిగ్ బాస్ రెగ్యులర్ సీజన్ మాదిరిగానే బిగ్ బాస్ నాన్ స్టాప్ 24/7 ఒక సీజన్ ని నడిపించారు. అది కేవలం డిస్నీ హాట్ స్టార్ లోనే వస్తుంది. ఆ మొదటి సీజన్ విజేతగా బిందు మాధవి గెలిచింది. ఐతే ఆ సీజన్ కు సరిగా ఆదరణ లేదని బీబీ టీం నాన్ స్టాప్ సీజన్ ని ఆపేసింది. ఐతే బిగ్ బాస్ సీజన్ 8 ముగుస్తున్న ఈ టైం లో బిగ్ బాస్ నాన్ స్టాప్ గురించి చర్చ నడుస్తుంది.
బీబీ నాన్ స్టాప్ 24/7 కి ఏర్పాట్లు చేస్తున్నారట. ప్రస్తుతం ఉన్న హౌస్ నే కొద్దిగా మార్చి బీబీ నాన్ స్టాప్ సీజన్ స్టార్ట్ చేస్తారట. తెలుస్తున్న సమాచారం మేరకు బీబీ నాన్ స్టాప్ మరీ ఎక్కువ లేట్ చేయకుండా ఫిబ్రవరి లోనే మొదలు పెట్టే ఏర్పాట్లు చేస్తున్నారట. ఫిబ్రవరి నుంచి మొదలు అంటే ఇప్పటి నుంచే ఆ సీజన్ కంటెస్టెంట్స్ ని ఆడిషన్ చేయాల్సి ఉంటుంది.
బీబీ నాన్ స్టాప్ మొదటి సీజన్ లో ఆల్రెడీ బిగ్ బాస్ కి వచ్చిన కొందరిని సెలెక్ట్ చేశారు. ఐతే బీబీ నాన్ స్టాప్ సెకండ్ సీజన్ లో కూడా అలాంటిది చేస్తారా లేదా అన్నది చూడాలి. బీబీ నాన్ స్టాప్ సీజన్ 2 కి హోస్ట్ గా కూడా నాగార్జున కొనసాగుతారని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 8 ముగుస్తుంది. మళ్లీ నెక్స్ట్ సీజన్ వరకు వెయిట్ చేయాలా అనుకునే వారికి ఇది స్పెషల్ న్యూస్ అని చెప్పొచ్చు.
బీబీ నాన్ స్టాప్ కూడా 100 రోజుల పాటు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయనుంది. బీబీ నాన్ స్టాప్ సెకండ్ సీజన్ లో ఎవరెవరు కంటెస్టెంట్స్ గా వస్తారు. ఈసారి నాన్ స్టాప్ సీజన్ ఎలా రెడీ చేస్తారు.. ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అన్నది చూడాలి. ఇదే కాదు బిగ్ బాస్ సీజన్ 9ని కూడా ఈసారి జూలై, ఆగష్టులో మొదలు పెట్టే ప్లాన్ లో ఉన్నారని టాక్. మొత్తానికి బీబీ నాన్ స్టాప్ సీజన్ 2 పూర్తి కాగానే మళ్లె బిగ్ బాస్ సీజన్ 9 హడావిడి మొదలవుతుందని చెప్పొచ్చు.