బిగ్ బాస్ 8 : అర్ధరాత్రి హౌస్ మేట్స్ ని భయపెట్టిన గంగవ్వ.. ఏం జరిగింది..?
కానీ గంగవ్వకి ఎలాంటి హెల్త్ ఇష్యూ లేదని గంగవ్వకు సంబంధించిన టీం చెబుతుంది. ఐతే గంగవ్వ అర్ధరాత్రి చేసిన హంగామా అంతా కూడా ఒక ఫ్రాంక్ అని కొందరు అంటున్నారు.
By: Tupaki Desk | 23 Oct 2024 7:07 AM GMTబిగ్ బాస్ 8 లో గంగవ్వ అర్ధరాత్రి చేసిన హంగామా హౌస్ మెట్స్ అందరికీ భయాన్ని కలిగించింది. అర్ధరాత్రి అందరు పడుకున్న తర్వాత ఒక్కతే లివింగ్ ఏరియాలోని టేబుల్ మీద కూర్చుని ఒక్కతే పెద్దగా అరుస్తూ కనిపించింది. ఏంటీ అరుపులు అని గమనించిన హౌస్ మెట్స్ కొందరు లేచి ఆమె దగ్గరకు వస్తే ఆమె రకరకాలుగా ప్రవర్తిస్తుంది. పెద్దగా అరుస్తుంది.. దగ్గరకు వచ్చిన వారిని కొట్టేంత పనిచేస్తుంది. అప్పటికీ గౌతం, తేజ, అవినాష్, మెహబూబ్ ఆమెకు హెల్త్ ఏమైనా బాగోలేదా అని ఆమె కాళ్లు చేతులు రుద్ధడం మొదలు పెట్టారు.
చిన్నగా ఆమె బెడ్ మీదకు తీసుకెళ్లి పడుకోబెట్టారు. ఆమెలోని ఈ వింత ప్రవర్తన హౌస్ మెట్స్ అందరికీ షాక్ ఇచ్చింది. పృధ్వి, నిఖిల్ తప్ప అందరు హౌస్ మెట్స్ గంగవ్వ చేసిన హంగామాకి నిద్ర లేకుండా అలానే కూర్చుని ఆమెను చూస్తూ ఉండిపోయారు. ఓ పక్క హౌస్ లో గంగవ్వకు హార్ట్ ఎటాక్ వచ్చిందని ఆమెను మెడికల్ రూం లోకి తీసుకెళ్లారని వార్తలు వచ్చాయి.
కానీ గంగవ్వకి ఎలాంటి హెల్త్ ఇష్యూ లేదని గంగవ్వకు సంబంధించిన టీం చెబుతుంది. ఐతే గంగవ్వ అర్ధరాత్రి చేసిన హంగామా అంతా కూడా ఒక ఫ్రాంక్ అని కొందరు అంటున్నారు. హౌస్ మెట్స్ అంతా డిస్ట్రబ్ అయిన ఈ ఘటన నిజంగా ఫ్రాంక్ అయితే మాత్రం గంగవ్వకు కాస్త మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఐతే ఒకవేళ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ అయితే మాత్రం గంగవ్వకి మంచి మైలేజ్ వస్తుంది.
ఏది ఏమైనా 70 ప్లస్ ఏజ్ లో బిగ్ బాస్ హౌస్ లో గంగవ్వ అలా నిలబడటం చాలా గొప్ప విషయం. ఆల్రెడీ ఆమె బిగ్ బాస్ సీజన్ 4 లో ఐదు వారాల పాటు హౌస్ లో ఉండి ఆ తర్వాత తనే బయటకు వచ్చింది. ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వెళ్లి ఆమె తన ఆట ఆడుతుంది. ఈ సీజన్ టాప్ 5 లో గంగవ్వ దాదాపు ఫిక్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి నెక్స్ట్ రాబోయే వారాల్లో ఆమె ఆట ఎలా ఉంటుంది అన్నది చూడాలి.