బిగ్ బాస్ 8 : టాప్ 5 కాదా.. ప్లాన్ మార్చేశారా..?
బిగ్ బాస్ సీజన్ 8 లో టాప్ 5 కాదు టాప్ 6 అని తెలిసి ఆడియన్స్ ఖుషి అవుతున్నారు.
By: Tupaki Desk | 2 Dec 2024 4:16 AM GMTబిగ్ బాస్ సీజన్ ముగుస్తుంది అంటే ఫైనల్ వీక్ దాకా ఎవరు వస్తారన్న ఎగ్జైట్మెంట్ మొదలవుతుంది. ముఖ్యంగా చివరి రెండు వారాలే ఉన్న టైం లో ఆడియన్స్ తమకు నచ్చిన కంటెస్టెంట్ ను టాప్ లోకి పంపించేందుకు కృషి చేస్తారు. ఐతే బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ అనగానే అందరు టాప్ 5 అనే అనుకుంటారు. కానీ సీజన్ 7 లో టాప్ 6 గా ప్లాన్ చేశారు. సీజన్ 8 లో కూడా టాప్ 5 కాదు టాప్ 6 ఉంటుందని తెలుస్తుంది.
ఎందుకంటే ఆదివారం పృధ్వి హౌస్ నుంచి బయటకు రావడంతో ఇంకా హౌస్ లో నిఖిల్, నబీల్, ప్రేరణ, విష్ణు ప్రియ, గౌతం, అవినాష్, రోహిణి మాత్రమే ఉన్నారు. వీరిలో ఒకరు మాత్రమే నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే నెక్స్ట్ వీక్ ఎవరైతే వెళ్తారో వారు తప్ప మిగతా అంతా కూడా ఫైనలిస్ట్ అన్నట్టే లెక్క.
సో అందరు టాప్ 5 అనుకున్న బజ్ కాస్త ఇప్పుడు టాప్ 6 కి మారుతుంది. ఇక ఈ సీజన్ చివరి ఎలిమినేషన్ ఎవరు అవుతారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. అవినాష్ ఆల్రెడీ ఫైనలిస్ట్ అయ్యాడు కాబట్టి అతను కాకుండా ఉన్న వారిలో రోహిణి, ప్రేరణ, విష్ణు ప్రియ, నబీల్ వీరిలోనే ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
ఐతే అది ఎవరన్నది ఆడియన్స్ వేసే ఓట్లను బట్టి ఉంటుంది. బిగ్ బాస్ సీజన్ 8 లో టాప్ 5 కాదు టాప్ 6 అని తెలిసి ఆడియన్స్ ఖుషి అవుతున్నారు. ఇంతకీ చివరి వారం హౌస్ నుంచి వెళ్లే ఆ కంటెస్టెంట్ ఎవరు అన్నది చూడాలి. ఐతే చివరి వారం కాబట్టి హౌస్ లో అందరు కూడా తమ బెస్ట్ ఇచ్చేందుకు కృషి చేస్తారు. ఎలాగైనా టాప్ 6 కి వెళ్లాలని అందరు ప్రయత్నిస్తారు.
సీజన్ 8 లో ఫైనల్ వీక్ కి ఎవరెవరు ఉంటారన్నది నెక్స్ట్ వీక్ తెలుస్తుంది. ఐతే ఆల్రెడీ నిఖిల్, గౌతం లు టైటిల్ రేసులో ఉన్నారు. అవినాష్ ఆల్రెడీ ఫైనలిస్ట్ అయ్యాడు సో ఈ ముగ్గురు కాకుండా మిగిలిన నలుగురిలోనే నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది. ఈ సీజన్ చివరి వారం ఎలిమినేషన్ కంటెస్టెంట్ మొదటి నుంచి ఆట ఆడుతున్న వారు అవుతారా.. లేదా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఒకరు అవుతారా అన్నది చూడాలి.