Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 8 : నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారు.. డేంజర్ ఎవరికి..?

బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ సోమవారం మాత్రమే కాదు మంగళవారం కూడా కొనసాగింది.

By:  Tupaki Desk   |   9 Oct 2024 5:21 AM GMT
బిగ్ బాస్ 8 : నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారు.. డేంజర్ ఎవరికి..?
X

బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ సోమవారం మాత్రమే కాదు మంగళవారం కూడా కొనసాగింది. నిన్నటి ఎపిసోడ్ తో నామినేషన్స్ ప్రక్రియ పూర్తింది. ఓజీ క్లాన్ లోని సభ్యులను కొత్తగా వైల్డ్ కార్డ్ గా వచ్చిన రాయల్ క్లాన్ సభ్యులు నామినేట్ చేయాల్సి ఉంది. ఐతే వారంతా కూడా యష్మి, పృధ్వి, సీత, విష్ణు ప్రియలను ఎంపిక చేశారు. మెగా చీఫ్ అయిన కారణంగా నబీల్ ని నామినేషన్స్ నుంచి మినహాయించారు. ఐతే రాయల్ క్లాన్ నుంచి కూడా ఇద్దరిని నామినేట్ చేయాలని ఓజీ క్లాన్ కి చెప్పాడు బిగ్ బాస్.

ఐతే ఆల్రెడీ రాయల్ క్లాన్ లో ఉన్న నామినేషన్ షీల్డ్ ని నయని పావనికి ఇవ్వగా ఆమెను కాకుండా మిగిలిన ఏడుగురిలో మెహబూబ్, గంగవ్వని నామినేట్ చేశారు ఓజీ క్లాన్ సభ్యులు. సో ఫైనల్ గా ఈ వారం నామినేషన్స్ లో యష్మి, సీత, విష్ణు ప్రియ, పృధ్విలతో పాటుగా మెహబూబ్, గంగవ్వ నామినేషన్స్ లో ఉన్నారు. గంగవ్వని నామినేషన్స్ లో వేయడం వెనక ఆమె ఖచ్చితంగా సేవ్ అవుతుందన్న నమ్మకంతోనే ఓజీ క్లాన్ సభ్యులు వేశారు.

గంగవ్వ కూడా యష్మి, విష్ణు ప్రియలను నామినేట్ చేస్తూ మిల్క్ ప్యాకెట్ ఇవ్వలేదన్న సింపుల్ రీజన్ చెప్పిందనే గంగవ్వని పరిగణలోకి తీసుకున్నారు. సో మెహబూబ్, గంగవ్వ రాయల్ క్లాన్ నుంచి నామినేషన్స్ లో ఉన్నారు. మరి ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది చూడాలి. ప్రస్తుతానికి డేంజర్ జోన్ లో అయితే విష్ణు ప్రియ, మెహబూబ్ ఉన్నారని చెప్పొచ్చు. ఐతే ఫ్రై డే కల్లా ఎవరు లీస్ట్ ఉంటారన్నది చెప్పడం కష్టం.

ఈ వారం విష్ణు ప్రియ టాస్కుల్లో ఎలాంటి పెర్ఫార్మ్ చేయలేకపోతే మాత్రం ఆమె ఎలిమినేట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. మరి విష్ణు ప్రియ అవుతుందా మరో కంటెస్టెంట్ ఎవరైనా అవుతారా లేదా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఒకరు ఎలిమినేట్ అవుతారా అన్నది చూడాలి. హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తో ఐదువారాలుగా ఉన్న కంటెస్టెంట్స్ మీద కొంత ప్రెజర్ పడినట్టుగా అనిపిస్తుంది. ఐతే వచ్చిన వాళ్లంతా మణికంఠకు పాజిటివ్ గా మాట్లాడటంతో పాటు ఈ వారం నామినేషన్స్ లో లేకపోవడం వల్ల అతను చాలా కూల్ గా కనిపిస్తున్నాడు.