Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 8 : టైటిల్ మన ఆరుగురిలో ఒకరిదే అవ్వాలి..!

బిగ్ బాస్ సీజన్ 8 లో రాయల్ క్లాన్ వర్సెస్ ఓజీ క్లాన్ టాస్కులు రసవత్తరంగా సాగుతున్నాయి.

By:  Tupaki Desk   |   24 Oct 2024 7:04 AM GMT
బిగ్ బాస్ 8 : టైటిల్ మన ఆరుగురిలో ఒకరిదే అవ్వాలి..!
X

బిగ్ బాస్ సీజన్ 8 లో రాయల్ క్లాన్ వర్సెస్ ఓజీ క్లాన్ టాస్కులు రసవత్తరంగా సాగుతున్నాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంతా కూడా కలిసి పాత కంటెస్టెంట్స్ ని నామినేట్ చేస్తూ వారి గేమ్ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ఐతే ఈ విషయం లేట్ గా కనిపెట్టిన ఓజీ క్లాన్ మెంబర్స్ వారికి గట్టి పోటీ ఇస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 8 లో వైల్డ్ కార్డ్ గా వచ్చిన కంటెస్టెంట్స్ మొదటి టార్గెట్ గా పాత కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. అందుకే వారు తమ రాయల్ క్లాన్ మెంబర్స్ ని కాకుండా ఓజీ క్లాన్ మెంబర్స్ ని నామినేట్ చేస్తున్నారు.

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో బీబీ రాజ్యం టాస్క్ నడుస్తుంది. అందులో మొదటి రౌండ్ అయిన లేక్ ని రాయల్ క్లాన్ సొంతం చేసుకోగా ఓజీ క్లాన్ వ్యవసాయాన్ని సొంతం చేసుకుంది. రెండో రౌండ్ లో గౌతం, మెహబూబ్ తో నిఖిల్, పృధ్వి పోటీ పడి మరీ వారికి ఇచ్చిన గోనె సంచులను వారి బండి మీద పెట్టారు. మెహబూబ్, గౌతం ఎంత ప్రయత్నించినా కూడా నిఖిల్, పృధ్వి లను ఆపలేకపోయారు. మధ్యలో గౌతం, మెహబూబ్ బదులుగా అవినాష్, తేజ కూడా ఈ టాస్క్ ఆడినా లాభం లేకుండా పోయింది.

ఇక రాయల్ క్లాన్ ఇస్తున్న టఫ్ ఫైట్ కు ఓజీ క్లాన్ మెంబర్స్ అంతా కూడా అదే రేంజ్ పోటీ ఇవ్వాలని సిద్ధమయ్యారు. ఐతే ఈ టాస్క్ జరుగుతున్న టైం లో నిఖిల్ ఓజీ క్లాన్ తో ఈసారి టైటిల్ కొడితే మన ఆరుగురిలో ఒకరు కొట్టాలని అన్నాడు. సీజన్ మొదటి నుంచి ఆడుతున్నారు కాబట్టి ఆ స్కోప్ వారికే ఎక్కువ ఉంటుంది. ఐతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో టైటిల్ విన్నర్ అయ్యేంత బజ్ ఎవరికి లేదు కానీ గంగవ్వకు సింపతీ ఓట్స్ పడతాయని తెలిసిందే. ఆమె టాప్ 5 దాకా తప్పకుండా ఉంటుందనిపిస్తుంది.

నిఖిల్ చెప్పాడని కాదు కానీ వైల్డ్ కార్డ్ కన్నా టైటిల్ విన్నర్ క్వాలిటీస్ ఓజీ క్లాన్ లోనే ఉన్నాయి. ఐతే టాస్కులు ఆడి దాన్ని మరింత ఈజీ చేయాలని ఓజీ క్లాన్ డిసైడ్ అయ్యింది. మరి ఓజీ క్లాన్ లో ఎవరు రేసులో చివరి దాకా నిలుస్తారు అన్నది చూడాలి.