Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 8 : ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..?

బిగ్ బాస్ సీజన్ 8 మొదటి వారం పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 1 ఆదివారం సాయంత్రం మొదలైన ఈ సీజన్ వారం రోజులు ప్రేక్షకులను మెప్పించింది.

By:  Tupaki Desk   |   7 Sep 2024 3:35 PM GMT
బిగ్ బాస్ 8 : ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..?
X

బిగ్ బాస్ సీజన్ 8 మొదటి వారం పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 1 ఆదివారం సాయంత్రం మొదలైన ఈ సీజన్ వారం రోజులు ప్రేక్షకులను మెప్పించింది. అంతేకాదు ఏ సీజన్ లో జరగనట్టుగా ఫస్ట్ వీక్ లోనే నామినేషన్స్ లో హౌస్ మెట్స్ మధ్య హడావిడి జరిగింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి వెళ్లగా మొదటి వారం నామినేషన్స్ లో ఆరుగురు హౌస్ మెట్స్ ఉన్నారు. వారిలో మణికంఠ, విష్ణు ప్రియ, పృధ్విరాజ్, శేఖర్ బాషా, బేబక్క, సోనియా ఉన్నారు. ఐతే వీరిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది చర్చ జరుగుతుంది.

హౌస్ లో నాగ మణికంఠ తన పాస్ట్ నే తలచుకుంటూ హౌస్ లో అంతగా యాక్టివ్ గా ఉండట్లేదని అందరు అనుకుంటున్నారు. అతనే ఈ వారం దాదాపు ఎలిమినేట్ అవుతారని అనుకున్నారు. కానీ అతని పరిస్థితిని అర్థం చేసుకున్న ఆడియన్స్ మాత్రం అతన్ని సేవ్ చేయాలని ఓట్స్ వేశారు. సో ఈ వారం మణికంఠ హౌస్ నుంచి బయటకు వెళ్తాడని అనుకోగా అతను దాదాపు సేఫ్ అయినట్టే అని తెలుస్తుంది.

ఐతే ఓటింగ్ ఎనాలసిస్ చూస్తే లీస్ట్ లో బేబక్క, శేఖర్ బాషా ఉన్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత స్థానంలో సోనియా ఉంది. ఐతే ఈ ముగ్గురిలో బేబక్క ఎలిమినేట్ అయినట్టుగా తెలుస్తుంది. బిగ్ బాస్ ఎలిమినేషన్ ఎపిసోడ్ ముందు రోజు అంటే శనివారమే షూట్ చేస్తారు. ఈ క్రమంలో బిగ్ బాస్ నుంచి లీక్స్ రావడం కామన్ అయిపోయింది. అందుకే ఆదివారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో ముందు రోజే లీక్ అవుతుంది.

బిగ్ బాస్ సీజన్ 8 తొలి వారమే బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది. ఐతే ఈ ఎలిమినేషన్ ప్రక్రియ నిజమేనా కాదా అన్నది ఆదివారం ఎపిసోడ్ లో తెలుస్తుంది. బెజవాడ బేబక్క సోషల్ మీడియా సెలబ్రిటీగా హౌస్ లోకి వచ్చారు. వచ్చిన రోజు తెల్లారే కుక్కర్ గొడవతో ఆమెను కార్నర్ చేస్తూ సోనియా పెద్ద గొడవ చేసింది. ఐతే హౌస్ లో ఉన్న వారం రోజులు బేబక్క ఎక్కువగా కిచెన్ లోనే కనబడింది. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా బెజవాడ బేబక్క ఇక్కడ దాకా రావడమే ఆమె గొప్ప అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. ఐతే ఈ ఎలిమినేషన్ పై ఆమె ఎలా స్పందిస్తారు అన్నది చూడాలి.