Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 8 : ఎలిమినేట్ అయిన షాకింగ్ కంటెస్టెంట్..!

బిగ్ బాస్ సీజన్ 8 లో 8వ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన కంటెస్టెంట్ ఎవరన్నది లీక్ అయ్యింది.

By:  Tupaki Desk   |   27 Oct 2024 6:03 AM GMT
బిగ్ బాస్ 8 : ఎలిమినేట్ అయిన షాకింగ్ కంటెస్టెంట్..!
X

బిగ్ బాస్ సీజన్ 8 లో 8వ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన కంటెస్టెంట్ ఎవరన్నది లీక్ అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం ఆరుగురు హౌస్ మెట్స్ నామినేషన్స్ లో ఉండగా ఆరుగురిలో లీస్ట్ ఓటింగ్ వచ్చిన వారు ఎలిమినేట్ అవుతారు. ఈ క్రమంలో ఆరుగురిలో నలుగురు కంటెస్టెంట్ సే పొజిషన్ లో ఉండగా ఇద్దరు మాత్రం లీస్ట్ ఓటింగ్ లో ఉన్నారు. వారిద్దరిలోనే ఈరోజు ఎలిమినేషన్ జరుగుతుంది. ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వారిని ఒకసారి చూస్తే నిఖిల్, ప్రేరణ, విష్ణు ప్రియ, పృధ్వి, నయని పావని, మెహబూబ్ ఉన్నారు. ఈ ఆరుగురిలో ఒకరు ఈరోజు హౌస్ నుంచి బయటకు వచ్చేస్తారు.

ఐతే శనివారం నాడే ఆదివారం ఎపిసోడ్ షూట్ జరుగుతున్న కారణంగా ముందే ఎవరు ఎలిమినేట్ అవుతున్నారన్నది తెలుస్తుంది. ఐతే శనివారం షూటింగ్ పూర్తి కాకముందే నయని పావని ఎలిమినేట్ అని సోషల్ మీడియా మొత్తం ప్రచారం జరిగింది. దాదాపు అందరు అదే నిజమని నమ్మారు. ఈ వారం నయని పావని పర్ఫార్మెన్స్ కూడా అంతగా ఏమి బాగాలేదు. హౌస్ లో ఆమె అసలు ఏమాత్రం కనిపించట్లేదు. అందుకే ఆడియన్స్ ఆమెకు లీస్ట్ ఓటింగ్ ఇచ్చారేమో అనుకున్నారు.

అందరు నయని పావనినే ఈ వారం ఎలిమినేట్ అవుతున్నట్టు ఫిక్స్ అవ్వగా బిగ్ బాస్ మెహబూబ్ ని ఎలిమినేట్ చేస్తూ షాక్ ఇచ్చారు. మెహబూబ్ కి తక్కువ ఓటింగ్ వచ్చి ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన మెహబూబ్ టాస్కుల్లో తన సత్తా చాటాడు. వైల్డ్ కార్డ్ గా వచ్చిన 3 వారాల్లోనే మెగా చీఫ్ గా కూడా ఉన్నాడు. గౌతం కన్నా ముందు మెగా చీఫ్ గా మెహబూబ్ ఉన్నాడు.

ఈ వారం మెహబూబ్ ఆట బాగానే ఉంది. కానీ బిగ్ బాస్ అంటే కేవలం ఆట ఒక్కటే కాదు మిగతా యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఐతే మెహబూబ్ ఎలిమినేషన్ కి కారణం ఓటింగ్ వల్లేనా లేదా అతను నబీల్ తో మాట్లాడిన కమ్యునిటీ కామెంట్స్ ఏవైనా రీజన్ అయ్యాయా అన్నది కూడా చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా బిగ్ బాస్ ఎలిమినేషన్ ప్రాసెస్ ఇప్పటివరకు లీస్ట్ ఓటింగ్ వచ్చిన వారినే చేస్తూ వచ్చారు. సో ఈ వారం కూడా మెహబూబ్ అందరి కన్నా లీస్ట్ ఓటింగ్ తో హౌస్ నుంచి నిష్క్రమించాడని చెప్పొచ్చు.

బిగ్ బాస్ సీజన్ 8 లో ఈరోజు దీపావళి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. శనివారం ఎపిసోడ్ లో తమిళ స్టార్ హీరో సూర్య వచ్చి కంగువ ప్రమోషన్స్ చేశారు. స్టేజ్ మీద నాగార్జునతో పాటు సూర్యని చూసి హౌస్ మెట్స్ అంతా కూడా సర్ ప్రైజ్ అయ్యారు. ఐతే సూర్యకు సర్ ప్రైజ్ ఇచ్చేలా హౌస్ మెట్స్ తో అతని మెడ్లీ సాంగ్ పర్ఫార్మెన్స్ చేయించి సూర్యని కూడా షాక్ అయ్యేలా చేశారు కంటెస్టెంట్స్. ఈరోజు కూడా కిరణ్ అబ్బవరం క టీం తో పాటుగా లక్కీ భాస్కర్ హీరో దుల్కర్ సల్మాన్ ఇంకా అమరన్ గా వస్తున్న శివ కార్తికేయన్ కూడా బిగ్ బాస్ లో కనిపించి అలరించనున్నారు.