బిగ్ బాస్ 8 : సెకండ్ ఎలిమినేషన్ లీక్.. స్ట్రాంగ్ కంటెస్టెంట్ హౌస్ కి బై బై..!
బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం రోహిణి తప్ప మిగతా కంటెస్టెంట్స్ అంతా నామినేషన్స్ లో ఉన్నారు.
By: Tupaki Desk | 1 Dec 2024 3:43 AM GMTబిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం రోహిణి తప్ప మిగతా కంటెస్టెంట్స్ అంతా నామినేషన్స్ లో ఉన్నారు. ఐతే శనివారం ఎపిసోడ్ లో అవినాష్ ని సేఫ్ చేసి అతను గెలుచుకున్న టికెట్ టు ఫినాలె ద్వారా సీజన్ 8 ఫస్ట్ ఫైనలిస్ట్ గా అనౌన్స్ చేశారు హోస్ట్ నాగార్జున. అవినాష్ ఫస్ట్ ఫైనలిస్ట్ షీల్డ్ ఇచ్చే ప్రాసెస్ లో సాంగ్ తో అతన్ని ఆటని మెచ్చుకున్నారు. అదే క్రమంలో హోస్ట్ నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లో గోల్డెన్ టికెట్, బ్లాక్ టికెట్ ఇచ్చారు.
గోల్డెన్ టికెట్ కేవలం నిఖిల్, గౌతం, రోహిణిలకు రాగా.. మిగతా వారికి బ్లాక్ టికెట్ వచ్చింది. ఇక ఈ వారం డబల్ ఎలిమినేషన్ లో భాగంగా మొదటి ఎలిమినేషన్ టేస్టీ తేజ శనివారం ఎపిసోడ్ లోనే హౌస్ నుంచి బయటకు పంపించారు. ఐతే ఈ వారం డబల్ ఎలిమినేషన్ చెప్పడంతో ఇంకా హౌస్ లో నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
ఐతే ఆదివారం ఎపిసోడ్ కూడా షూటింగ్ పూర్తి కాగా బయటకు వచ్చిన బిగ్ బాస్ లీక్స్ ప్రకారం ఈ వారం ఎలిమినేట్ అయిన రెండో కంటెస్టెంట్ కూడా రివీల్ అయ్యింది. ఈ వారం రెండో కంటెస్టెంట్ గా స్ట్రాంగ్ అనుకున్న పృధ్వి ఎలిమినేట్ అయ్యాడు. సీజన్ 8 లో టాస్కుల్లో తన స్ట్రాంగ్ నెస్ చూపిస్తూ సత్తా చాటాడు పృధ్వి. ఐతే అతను టాస్కులు బాగా ఆడినా సరే మిగతా విషయాల్లో చాలా వెనక ఉన్నాడు.
ముఖ్యంగా టాస్కుల్లో అతను తన ఆవేశంతో కంటెస్టెంట్స్ ని టార్గెట్ చేస్తూ కొన్ని భూతులు మాట్లాడతాడు. అఫ్కోర్స్ నాగార్జున చెప్పిన తర్వాత చాలా వరకు మార్చుకున్నాడు. ఏదైనా గొడవ అయితే అతను అవతల వారి మీద మీదకు వెళ్తాడు. ఇలా పృధ్వి మీద చాలా నెగిటివ్స్ ఉన్నాయి. ఐతే హౌస్ లో అందరితో కన్నా విష్ణు ప్రియతో ఎక్కువ క్లోజ్ గా ఉన్నాడు. మిగతా కంటెస్టెంట్స్ ని పట్టించుకోలేదు.
ఈ కారణాలన్నీ కూడా కలిసి ఈ వీక్ పృధ్విని ఎలిమినేట్ అయ్యేలా చేశాయి. ఐతే పృధ్వి ఎలిమినేషన్ విష్ణు ప్రియకు షాక్ ఇస్తుందని చెప్పొచ్చు. హౌస్ లో ఆమె పృధ్వితో బాగా కనెక్ట్ అయ్యింది. ఇక పృధ్వి ఎగ్జిట్ తో టాప్ 5 పొజిషన్ లో మార్పులు వస్తాయి. ఇప్పటికే అవినాష్ టాప్ 5 లో ప్లేస్ దక్కించుకోగా మిగిలిన నలుగురు ఎవరన్నది త్వరలో తెలుస్తుంది.