Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 8 : 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్.. హౌస్ మేట్స్ షాక్..!

బిగ్ బాస్ సీజన్ 8 లో నాలుగో వారం కంటెస్టెంట్స్ కు షాక్ ఇస్తూ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి రివీల్ చేశాడు బిగ్ బాస్.

By:  Tupaki Desk   |   25 Sep 2024 12:15 PM GMT
బిగ్ బాస్ 8 : 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్.. హౌస్ మేట్స్ షాక్..!
X

బిగ్ బాస్ సీజన్ 8 లో నాలుగో వారం కంటెస్టెంట్స్ కు షాక్ ఇస్తూ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి రివీల్ చేశాడు బిగ్ బాస్. హౌస్ లో కొత్తగా సీత రెండో క్లాన్ కి చీఫ్ గా ఎంపికైంది. ఐతే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికీ 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ హౌస్ లోకి వచ్చేందుకు సిద్ధగా ఉన్నారు. వారిలో ఎంతమంది హౌస్ లోకి రావాలన్నది మీరు నిర్ణయించాల్సి ఉంటుందని అన్నాడు బిగ్ బాస్.

బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లు హౌస్ మెట్స్ గెలిస్తే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ క్యాన్సిల్ అవుతుంది. ఒకవేళ కంటెస్టెంట్స్ ఓడిపోతే మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది. బిగ్ బాస్ సీజన్ 8 లో అన్ని కొత్త కాన్సెప్ట్ లు ఉండనున్నాయని ముందు నుంచి చెబుతున్నారు. బిగ్ బాస్ సీజన్ 8 లో లిమిట్ లెస్ ఎంటర్టైన్ మెంట్ లో భాగంగా 12 మంది వైల్డ్ కార్డ్ లను బిగ్ బాస్ ప్రవేశ పెడుతున్నాడు. ఐతే వారిలో ఎవరు హౌస్ లోకి వస్తారన్నది చూడాలి.

వైల్డ్ కార్డ్ ఎంట్రీ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ చేతుల్లో ఉండటం కొత్తగా ఉంది. ఐతే సీజన్ 8 లో ఇలాంటివి చాలానే ఉంటాయని తెలుస్తుంది. ఇక హౌస్ లో నిఖిల్ ఒక చీఫ్ గా ఉండగా కొత్త చీఫ్ గా సీత ఎంపికైంది. నిఖిల్ క్లాన్ లో సోనియా, పృధ్వి, మణికంఠతో పాటు యష్మి కూడా జాయిన్ అయ్యింది. కొత్తగా ఏర్పడిన సీత క్లాన్ లో నబీల్, ఆదిత్య ఓం, విష్ణు ప్రియ, నైనిక, ప్రేరణ ఉన్నారు.

ఇదివరకు హౌస్ లో గ్రూప్ గేమ్ ఆడుతున్నారని గమనించిన బిగ్ బాస్ ఈసారి టాస్క్ లు అన్నీ ఇలా రెండు క్లాన్ ల మధ్య అన్నట్టుగా ఇస్తున్నాడు. ఐతే చీఫ్ గా పోటీ పడే టాస్క్ మాత్రం ఎవరికి వారు సొంతంగా ఆడుతున్నారు. ఏది ఏమైనా బిగ్ బాస్ సీజన్ 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి కూడా హౌస్ మెట్స్ ప్రమేయం ఉండేలా చేయడం ఆడియన్స్ కు మంచి జోష్ ఇస్తుంది. ఈ వీకెండ్ కల్లా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయని తెలుస్తుంది. ఐతే ఈసారి వైల్డ్ కార్డ్స్ 6 లేదా 8 మంది ఉంటారని టాక్.