Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 8 : అసలు ఆట మొదలైంది..!

ఎవరి మాటలు కన్విన్స్ గా అనిపిస్తాయో ఎవరి టీం కు తన అవసరం ఉందని భావిస్తారో ఆ టీం క్రౌన్ లోని వెళ్లాల్సి ఉంటుంది.

By:  Tupaki Desk   |   6 Sep 2024 4:03 AM GMT
బిగ్ బాస్ 8 : అసలు ఆట మొదలైంది..!
X

బిగ్ బాస్ సీజన్ 8 లో నామినేషన్స్ తర్వాత హౌస్ మెట్స్ మళ్లీ తమ రెగ్యులర్ యాక్టివిటీస్ లో బిజీ అయ్యారు. ఐతే ముగ్గురు చీఫ్ లు మూడు టీంలుగా ఏర్పడే ఛాన్స్ ఇచ్చిన బిగ్ బాస్.. చీఫ్ లుగా మారే టాస్క్ లో నెక్స్ట్ ప్లేస్ లో ఉన్న శేఖర్ బాషా, నబీల్, బేబక్కలకు సొంతంగా వారు ఏ గ్రూప్ లో ఉండాలో నిర్ణయించుకునే అవకాశం ఇచ్చారు. అందులో శేఖర్ బాషా యష్మి టీం, బేబక్క నిఖిల్ల్ టీం, నబీల్ నైనిక టీం లోకి వెళ్లారు. ఇక మిగిలిన వారిని బిగ్ బాస్ ఎవరి పేరైతే పిలుస్తాడో వారిని ఎవరు కావాలని అనుకుంటారో ఆ చీఫ్ లు వాళ్ల గురించి మాట్లాడాలి. ఎవరి మాటలు కన్విన్స్ గా అనిపిస్తాయో ఎవరి టీం కు తన అవసరం ఉందని భావిస్తారో ఆ టీం క్రౌన్ లోని వెళ్లాల్సి ఉంటుంది.

అలా నిఖిల్ టీం లోకి బేబక్క, మణికంఠ, సోనియా ఉండగా.. యష్మి టీం లోకి పృధ్విరాజ్, అభయ్ నవీన్, శేఖర్ బాషా, ప్రేరణ ఉన్నారు. నైనిక టీం లోకి ఆదిత్య ఓం, నబీల్, విష్ణు ప్రియ, కిరాక్ సీత ఉన్నారు. ఐతే నైనిక, యష్మి టీం లో నలుగురు ఉన్న కారణంగా వారిద్దరికి ఒక టాస్క్ ఇచ్చి గెలిచిన వారు నిఖిల్ టీం నుంచి ఒకరిని తీసుకునే అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్.

ఐతే ఆ ఆటలో యష్మి టీం విజయం సాధించారు. గురువారం ఎపిసోడ్ ఎలాంటి ఎమోషనల్ డ్యామేజ్ లేకుండా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది. ఐతే మణికంఠ ఇంకా ఎమోషనల్ గానే కనిపిస్తున్నాడు. అతను ఈ వీక్ నామినేషన్స్ లో ఉన్నాడు. అతను ఈ వారం ఎలిమినేట్ అవుతాడని అనుకుంటున్నా ఓటింగ్ పోల్స్ లో మాత్రం అతనికి ఆడియన్స్ బాగానే ఓట్స్ వేస్తున్నట్టు తెలుస్తుంది.

బిగ్ బాస్ సీజన్ 8 లో మొదటి వారం ఆరుగురు నామినేషన్స్ లో ఉన్నారు. మొదటి వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఐతే మిగతా సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ లో ఫస్ట్ వీక్ నుంచి హౌస్ మెట్స్ తమ ఆట తీరుతో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నారు.