Begin typing your search above and press return to search.

బిగ్‌బాస్ విన్నర్‌ ఎదురు చూపులు..!

అయినా ఇప్పటి వరకు కరణ్ వీర్‌ కి ప్రైజ్ మనీలో ఒక్క రూపాయి కూడా అందలేట.

By:  Tupaki Desk   |   24 Feb 2025 7:30 PM GMT
బిగ్‌బాస్ విన్నర్‌ ఎదురు చూపులు..!
X

హిందీ బిగ్‌బాస్ సీజన్‌ 18 మునుపెన్నడూ లేని విధంగా అద్భుతంగా సాగింది. ఇంతకు ముందు ఎప్పుడూ పెట్టని టాస్క్‌లను 18వ సీజన్‌లో పెట్టారు. ఎన్నో టాస్క్‌ల్లో గెలిచి, కంటెస్టెంట్స్‌తో పోరాడి కరణ్ వీర్‌ మెహ్రా విజేతగా నిలిచిన విషయం తెల్సిందే. విజేతగా నిలిచిన కరణ్‌ వీర్‌కి రూ.50 లక్షల ప్రైజ్‌ మనీతో పాటు, ఖరీదైన కారును అందిస్తున్నట్లు గ్రాండ్ ఫినాలే రోజున షో నిర్వాహకులు ప్రకటించారు. ఫినాలే ఎపిసోడ్‌ పూర్తి అయి నెల రోజులు దాటింది. అయినా ఇప్పటి వరకు కరణ్ వీర్‌ కి ప్రైజ్ మనీలో ఒక్క రూపాయి కూడా అందలేట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

సీజన్‌ 18 విజేతగా నిలిచిన సమయంలో తనకు ఇస్తానంటూ హామీ ఇచ్చిన కారును గత వారం అందుకున్నాను అన్నాడు. అయితే ప్రైజ్ మనీ మాత్రం ఇప్పటి వరకు తన చేతికి రాలేదు అన్నాడు. గత ఏడాదిలోనే కలర్స్ ఛానల్‌ నిర్వహించిన ఖత్రోన్‌ కే ఖిలాడీ సీజన్ 14లో కరణ్‌ విజేతగా నిలిచాడు. ఆ ప్రైజ్‌ మనీ ఇటీవల అందినట్లు తెలుస్తోంది. షో లో గెలిచిన వెంటనే డబ్బులు చేతికి ఇవ్వరు అని, చాలా ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత మాత్రమే ప్రైజ్ మనీ విజేతలకు అందుతుంది. హిందీ బాస్ విజేతకు మాత్రమే కాకుండా ఏ భాష బిగ్‌ బాస్ విజేతకు అయినా అదే వర్తిస్తుంది.

విన్నర్ కరణ్ వీర్‌ మెహ్రా మాట్లాడుతూ.. బిగ్‌ బాస్ 18 విజేతగా తాను నిలుస్తానని కలలో కూడా ఊహించలేదు. షో లో నేను ఉన్న సమయంలో ప్రేక్షకులు చూపించిన అభిమానం కారణంగానే నేను గెలిచాను. నేను గెలవకున్నా ఇదే విధంగా సింపుల్‌గా ఉండేవాడిని. గెలిచినంత మాత్రాన హంగామా చేసేయాలి అనుకునే రకం నేను కాదు అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. బిగ్‌బాస్‌కి వెళ్లిన తర్వాత నాకు చాలా అభిమానం దక్కింది. బయటకు వచ్చిన తర్వాత చూస్తే షాకింగ్‌గా అనిపించింది. ఈ స్థాయి అభిమానంను నేను ఊహించలేదని కరణ్ అన్నాడు.

బిగ్‌బాస్ సీజన్‌ 18 విజేతగా కరణ్‌ వీర్ మెహ్రా నిలిస్తే రన్నర్‌గా వివియన్ డిసేన నిలిచాడు. హిందీ భాషలో బిగ్‌ బాస్‌కి ఆధరణ సీజన్ సీజన్‌కి పెరిగి పోతుంది. అందుకే సల్మాన్‌ ఖాన్ పారితోషికం వందల కోట్లు పెంచుతూ వెళ్తున్నారట. కలర్స్‌లో టెలికాస్ట్‌ అవుతున్న బిగ్‌ బాస్ ముందు ముందు మరిన్ని ఓటీటీ సీజన్‌లు రావాలని అభిమానులు, ప్రేక్షకులు కోరుకుంటున్నారు. సీజన్‌ 18 విన్నర్‌ కరణ్ వీర్‌ తనకు వచ్చిన ప్రైజ్‌ మనీతో ఛారిటీ కార్యక్రమాలు చేస్తానంటూ గతంలోనే హామీ ఇచ్చాడు. అన్నట్లుగానే ఇప్పుడు కూడా డబ్బులు వచ్చిన వెంటనే తన సిబ్బంది పిల్లల చదువు కోసం వినియోగిస్తాను అంటూ హామీ ఇచ్చాడు.