Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 8 : టాప్ 5 లెక్క మార్చిన ఎలిమినేషన్..?

బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం డబల్ ఎలిమినేషన్ అని చెప్పి షాక్ ఇచ్చారు. ఆల్రెడీ శనివారం ఎపిసోడ్ లో లీస్ట్ ఓటింగ్ లో ఉన్న తేజాని ఎలిమినేట్ చేశారు.

By:  Tupaki Desk   |   1 Dec 2024 7:39 AM GMT
బిగ్ బాస్ 8 : టాప్ 5 లెక్క మార్చిన ఎలిమినేషన్..?
X

బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం డబల్ ఎలిమినేషన్ అని చెప్పి షాక్ ఇచ్చారు. ఆల్రెడీ శనివారం ఎపిసోడ్ లో లీస్ట్ ఓటింగ్ లో ఉన్న తేజాని ఎలిమినేట్ చేశారు. దాదాపు తేజాకి కూడా తానే ఎలిమినేట్ అవుతానని తెలిసిపోయింది అనుకుంటా అందుకే పెద్దగా షాక్ అవ్వలేదు. ఐతే తేజ ఎలిమినేషన్ అవినాష్, రోహిణిలకు కాస్త బాధ కలిగించింది. ఐతే డబల్ ఎలిమినేషన్ లో భాగంగా రెండో ఎలిమినేషన్ ఎవరన్నది కాస్త సస్పెన్స్ నడిచింది.

రోహిణి నామినేషన్స్ లో లేకపోవడం వల్ల ఆ తర్వాత ఉన్న వారంతా కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అవ్వడం వల్ల ఎలిమినేట్ అయ్యేది ఎవరా అని ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఉన్నారు. ఐతే బిగ్ బాస్ లీక్స్ ప్రకారం పృధ్వి రాజ్ శెట్టి ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది. ఈరోజు పృధ్వి హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతున్నాడు. ఐతే పృధ్వి ఎలిమినేట్ అవ్వడం వల్ల టాప్ 5 లెక్క మారే అవకాశం ఉంది.

ఎందుకంటే పృధ్వి టాస్కుల్లో టఫ్ ఫైట్ ఇస్తాడు. ఓటింగ్ పరంగా కాస్త వీక్ అని తెలిసినా అతనికి కూడా టాప్ 5 కి వెళ్లే క్వాలిటీస్ ఉన్నాయని అనిపించింది. పృధ్వి ఉంటే రోహిణి, ప్రేరణలకు టఫ్ అయ్యేది. కానీ పృధ్వి ఎలిమినేట్ అవ్వడం వల్ల టాప్ 5 లెక్కల్లో మార్పులు వచ్చేలా ఉన్నాయి. పృధ్వితో పాటు విష్ణు ప్రియ కూడా నెక్స్ట్ లీస్ట్ ఓటింగ్ తో కొనసాగుతుంది.

సో ఉన్న వారిలో టాప్ 5 అంటే ఆల్రెడీ అవినాష్ ఒక ఫైనలిస్ట్ కాబట్టి నలుగురిలో నిఖిల్, గౌతం లకు బయట ఉన్న క్రేజ్ తెలుసు కాబట్టి వారిద్దరు ఫైనల్ వీక్ కి కన్ ఫర్మ్ అన్నట్టే. ఐతే మిగతా ఇద్దరిలో మాత్రం నబీల్, ప్రేరణ, రోహిణి, విష్ణు ప్రియల మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది. మొదట్లో తన ఆటతో ఆడియన్స్ ని మెప్పించిన నబీల్, ప్రేరణ ఇద్దరు ఈ మధ్య గ్రాఫ్ పడిపోయేలా చేసుకున్నారు. వారిద్దరు మళ్లీ ట్రాక్ లోకి వస్తే మాత్రం వాళ్లకు ఛాన్స్ ఉంటుంది.

ఇక తన వల్ల కాదు అన్న ప్రతిసారి ప్రూవ్ చేసుకుంటూ వచ్చిన రోహిణి కూడా టాప్ 5 చేరేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి. తప్పకుండా ఆమె కూడా ఫైనలిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఐతే విష్ణు ప్రియ కు మాత్రం లీస్ట్ ప్రయారిటీ ఉంది. పృధ్వి హౌస్ నుంచి వెళ్లాడు కాబట్టి ఇక మీద అయినా ఆమె ఆట మీద ఫోకస్ చేస్తుందేమో చూడాలి. మొత్తానికి పృధ్వి ఎలిమినేషన్ తో ఉన్న వారిలో టాప్ 5 కి ఎవరెవరు వెళ్తారన్నది ఆసక్తికరంగా మారింది.