బిగ్ బాస్ 8 : గౌతం వర్సెస్ రోహిణి మధ్యలో అవినాష్..!
గౌతం తనని అశ్వధ్థామా 2.O అని అనొద్దని వేరే విధంగా చెబితే బాగుండేది కానీ అలా కాకుండా మైక్ విసిరేయడం తప్పని రోహిణి తన పాయింట్ చెప్పింది.
By: Tupaki Desk | 15 Oct 2024 7:30 AM GMTబిగ్ బాస్ సీజన్ 8 నామినేషన్స్ ప్రక్రియలో కావాల్సినంత డ్రామా నడిచింది. ముఖ్యంగా రోహిణి గౌతం ని నామినేట్ చేయగా అతను దాన్ని డిఫెండ్ చేసుకునే క్రమంలో మీరు కామెడీ చేస్తే మాకు నచ్చదని అన్నాడు. ఆ ప్రాసెస్ లో అవినాస్ కూడా ఇన్వాల్వ్ అయ్యి కామెడీ చేయడం అంత ఈజీ కాదని గౌతం తో వాధించాడు. గౌతం తనని అశ్వధ్థామా 2.O అని అనొద్దని వేరే విధంగా చెబితే బాగుండేది కానీ అలా కాకుండా మైక్ విసిరేయడం తప్పని రోహిణి తన పాయింట్ చెప్పింది.
ఐతే గౌతం మాత్రం తనని ప్రతిసారి ఆ మాటతో బుల్లియింగ్ చేస్తున్నారని చెప్పాడు. గౌతం ని నామినేట్ చేసింది రోహిణి అయితే వీరి మధ్య డిస్కషన్ లోకి అవినాష్ వచ్చి నానా రచ్చ చేశాడు. కమెడియన్స్ అంటే అంత వెర్రి వాడిలా కనిపిస్తున్నారా అంటూ అవినాష్ అన్నాడు. నేను సరదాగా అన్నాను నీకు హర్ట్ అయ్యింది దానికి సారీ చెప్పాను కానీ దాన్ని మళ్లీ బుల్లియింగ్ అనడం కరెక్ట్ కాదని అవినాష్ గౌతం తో అన్నాడు.
ఫైనల్ గా అవినాష్ గౌతం ముందు మోకాళ్లతో నీకు దండం పెడతా అని అవినాష్ అన్నాడు. అయినా కూడా గౌతం దాన్ని డ్రాగ్ చేస్తూ వచ్చాడు. నామినేషన్స్ తర్వాత గౌతం కూడా కన్నీళ్లు పెట్టుకుని తాను ఏదైతే జరగకూడదు అనుకున్ననో అదే జరుగుతుందని అన్నాడు. మొత్తానికి గౌతం కృష్ణ అశ్వధ్థామా 2.ఓ అని ఏదైతే లాస్ట్ సీజన్ లో అన్నాడో అదే ఈ సీజన్ లో అతనికి శాపంగా మారింది.
నిజానికి అశ్వధ్థామా అని గౌతం ని అంటే ఒకసారి హౌస్ మెట్స్ అందరికీ అది పర్సనల్ గా హర్ట్ అవుతుంది. అది బయట ట్రోల్ పాయింట్ కూడా అయ్యిందని చెబితే దాన్ని ఇంకోసారి రిపీట్ చేయరు కానీ అలా కాకుండా ఇలా ఎంత గొంతు చించుకుని అరిచినా వేస్ట్ అని ఆడియన్స్ భావిస్తున్నారు. స్పోర్టివ్ గా తీసుకుని ఉంటే గౌతం కి ఇది కలిసి వచ్చేది. కానీ కావాలని వాళ్లకు స్కోప్ ఇస్తూ అనవసరమైన ఇబ్బందుల్లో గౌతం పడుతున్నాడని అనిపిస్తుంది. మరి ఈ ఇష్యూ అతనికి ప్లస్ అవుతుందా లేదా అన్నది చూడాలి.