Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 8 : కొత్త చీఫ్ ని ఎంపిక చేసిన కంటెస్టెంట్స్..!

కాంతార క్లాన్ చీఫ్ గా లాస్ట్ వీక్ అభయ్ ఎంపిక కాగా అతను ఆదివారం ఎలిమినేట్ అయ్యి ఇంటికి వెళ్లాడు.

By:  Tupaki Desk   |   24 Sep 2024 8:38 AM GMT
బిగ్ బాస్ 8 : కొత్త చీఫ్ ని ఎంపిక చేసిన కంటెస్టెంట్స్..!
X

బిగ్ బాస్ 8 సోమవారం నామినేషన్స్ రచ్చ జరిగింది. వారం మొత్తం జరిగిన ఆటలో ఎవరి తప్పులు ఏంటన్నది చెబుతూ ఎవరు ఇంట్లో ఉండటానికి అర్హత లేదో వారి మీద నామినేషన్స్ వేసే అవకాశం ఉంటుంది. ఐతే కొందరు సిల్లీ రీజన్స్ చెప్పి నామినేషన్స్ వేసినా ప్రేక్షకులు ఎవరు హౌస్ లో ఉండాలి ఎవరు ఎలిమినేట్ అవ్వాలన్నది నిర్ణయిస్తారు. ఐతే బిగ్ బాస్ సీజన్ 8 నాలుగో వారంలో చీఫ్ ఎంపిక జరిగింది. ఆల్రెడీ ఇప్పటికే నిఖిల్ ఒక క్లాన్ కి చీఫ్ గా కొనసాగుతున్నాడు. శక్తి క్లాన్ చీఫ్ గా నిఖిల్ ఉన్నాడు.

కాంతార క్లాన్ చీఫ్ గా లాస్ట్ వీక్ అభయ్ ఎంపిక కాగా అతను ఆదివారం ఎలిమినేట్ అయ్యి ఇంటికి వెళ్లాడు. ఇక ఈ వారం కొత్త చీఫ్ ఎంపిక కంటెస్టెంట్స్ చేతుల్లోనే పెట్టాడు బిగ్ బాస్. కంటెస్టెంట్స్ అందరి బొమ్మలను పెట్టి ఒక్కొక్కరిని ఎవరు చీఫ్ అయ్యేందుకు అర్హత లేదో వారి బొమ్మని విరగ్గొట్టాల్సి ఉంటుంది. మెజారిటీ కంటెస్టెంట్స్ ఎవరిని చీఫ్ గా ఉంచాలని అనుకుంటారో వారిని ఎంపిక చేస్తారు.

ఐతే తెలుస్తున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ సీజన్ 8 నాలుగో వారం కొత్త చీఫ్ గా కిరాక్ సీతని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఇదివరకు సీజన్లలో కెప్టెన్ లానే ఈ సీజన్ లో చీఫ్ అని పెట్టారు. వారికి నామినేషన్స్ నుంచి మినహాయింపు ఉంటుంది. అంతేకాదు చీఫ్ కి కొన్ని ప్రత్యేక సౌకర్యాలు ఉంటాయి. నామినేషన్స్ నుంచి ఒకరిని సేఫ్ చేసే రైట్ కూడా ఉంటుంది. మొత్తానికి సీత ఈ వారం చీఫ్ గా ఎంపికైంది.

మొదటి నుంచి టాస్క్ ల పరంగా తన 100 పర్సెంట్ ఇస్తున్న సీత హౌస్ మేట్స్ అందరితో మంచిగా ఉంటుంది. అంతేకాదు ఎవరైనా ఎలిమినేట్ అయితే చాలు వారితో తనకున్న ఎమోషనల్ బాండింగ్ వల్ల కన్నీళ్లు పెడుతుంది. బిగ్ బాస్ సీజన్ 8 లో సీత వచ్చినప్పుడు మాములు కంటెస్టెంట్ అనిపించగా వారాలు గడుస్తున్నా కొద్దీ ఆమె స్ట్రాంగ్ అవుతుంది. ఇలానే కొనసాగితే కిరాక్ సీత టాప్ 5 లో ఉండే ఛాన్స్ కూడా ఉందని చెప్పొచ్చు.