Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 8 : సండే మరో ఎలిమినేషన్.. డేంజర్ ఎవరికి..?

బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం ఇప్పటికే మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పి ఆదిత్య ఓం ని హౌస్ నుంచి బయటకు పంపించారు

By:  Tupaki Desk   |   5 Oct 2024 5:21 AM GMT
బిగ్ బాస్ 8 : సండే మరో ఎలిమినేషన్.. డేంజర్ ఎవరికి..?
X

బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం ఇప్పటికే మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పి ఆదిత్య ఓం ని హౌస్ నుంచి బయటకు పంపించారు. ఈ వారం నామినేషన్స్ లో ఉన్న ఆరుగురిలో ఆదిత్య ఓం ఒకడు. ఐతే అతనికి లీస్ట్ ఓటింగ్ వచ్చిన కారణంగా మిడ్ వీక్ లోనే ఎలిమినేట్ చేసి షాక్ ఇచ్చారు. ఐతే ఆ తర్వాత మళ్లీ ఓటింగ్ లైన్స్ ఓపెన్ అవగా మిగతా ఐదుగురిలో కూడా మరొకరిని ఎలిమినేట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

ఈ వారం నామినేషన్స్ లో ఆదిత్య ఓం, నబీల్, విష్ణు ప్రియ, నైనిక, నిఖిల్, మణికంఠ ఉన్నారు. ఆదిత్య ఓం ఆల్రెడీ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. సో ఉన్న ఆ ఐదుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది తెలియాల్సి ఉంది. ఆదిత్య ఓం ని ఎలిమినేట్ చేసిన టైం లో సేవ్ గా ఉన్నారంటూ మణికంఠ, నిఖిల్, నబీల్ పేర్లు చెప్పాడు. ఐతే అప్పటికి డేంజర్ జోన్ లో నైనిక, విష్ణు ప్రియ ఉన్నారు. అలా చూస్తే ఆదివారం ఎలిమినేషన్ అయ్యేది కూడా వీరిద్దరిలో ఒకరనే చెప్పొచ్చు.

బిగ్ బాస్ సీజన్ 8 లో నైనిక మొదటి వారమే చీఫ్ గా అయ్యింది. ఫస్ట్ వీక్ ఆమె టాస్కులు కూడా బాగా ఆడింది. కానీ రాను రాను ఎందుకో ఆమె అంతగా గురి పెట్టలేకపోయింది. ఇక విష్ణు ప్రియ కూడా టాప్ యాంకర్ అయ్యుండి ఆమె ఆశించిన విధంగా ఆట ఆడట్లేదు. ఎప్పుడు పృధ్వితో పులిహోర కలపడం తప్ప ఆమె చేస్తుంది ఏమీ లేదు. విష్ణు ప్రియ, నైనికలలో ఒకరు ఆదివారం ఎలిమినేట్ అవుతారని తెలుస్తుంది.

ఐతే మణికంఠ సింపతీ సీకర్ గా బాగా డెవలప్ అయ్యాడు. హౌస్ లో ఉన్న వారంతా తనని కార్నర్ చేస్తున్నారనే భావన ఆడియన్స్ లో వచ్చేలా చేశాడు. ఐతే కొందరు మణికంఠ ఆడుతున్న సింపతీ గేం కనిపెట్టారు. అందుకే ఫర్ ఎనీ ఛాన్స్ మణికంఠ కూడా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశం కూడా ఉందని చెప్పొచ్చు. ఏది ఏమైనా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ తో ఆడియన్స్ కు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ వీకెండ్ లో బిగ్ బాస్ సీజన్ 8 లోకి మరో ఎనిమిది మంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వస్తున్నారు.