Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 8 : ఛీ.. ఛీ.. ఏంటి మాకీ రోత..?

ఎలాగు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని బిగ్ బాస్ ఈ సీజన్ రెండు క్లాన్ లుగా ఏర్పరచి ఒక క్లాన్ మీద మరో క్లాన్ ఎటాక్ చేసేలా టాస్కులు ఇస్తున్నాడు.

By:  Tupaki Desk   |   20 Sep 2024 4:36 AM GMT
బిగ్ బాస్ 8 : ఛీ.. ఛీ.. ఏంటి మాకీ రోత..?
X

సీజన్ 8 బిగ్ బాస్ మూడు వారాల క్రితం మొదలైంది. ఈసారి లిమిట్ లెస్ ఎంటర్టైన్మెంట్ అంటూ హోస్ట్ నాగార్జున ఇచ్చిన ఫ్రీడం వల్లో లేదా ఇలా ఆడితేనే ఇక్కడ ఉంటామన్న తెగింపో కానీ ఈ సీజన్ కంటెస్టెంట్స్ అటు ఆట.. ఇటు మాటలతో ఎవరికీ ఎవరు తగ్గట్లేదు. బిగ్ బాస్ సీజన్ 8 లో ఇప్పటికే గ్రూప్ ఆటలు మొదలయ్యాయి. ఎలాగు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని బిగ్ బాస్ ఈ సీజన్ రెండు క్లాన్ లుగా ఏర్పరచి ఒక క్లాన్ మీద మరో క్లాన్ ఎటాక్ చేసేలా టాస్కులు ఇస్తున్నాడు.

ఇక ఈ టాస్క్ ఆడే టైం లో ఎవరి మీద అయినా పగ ఉంటే టాస్క్ అడ్డు పెట్టుకుని వారిని టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రేరణ, విష్ణు ప్రియ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మనేలా ఉంది. ప్రభావతి 2.ఓ గుడ్ల టాస్క్ లో అయితే విష్ణు ప్రియ, ప్రేరణల ఫైట్ తీవ్ర స్థాయికి చేరుకుంది. ఏకంగా ఒకరిని ఒకరు క్యారెక్టర్ లె..స్ అనే రేంజ్ లో తిట్టుకున్నారు. క్లాన్ చీఫ్ అయిన అభయ్ చేతులెత్తేశాడు. అతనికి కచ్చితంగా వీకెండ్ లో నాగార్జున చేత ఉతుకుడు కార్యక్రమం ఉంటుంది.

మరోపక్క బిగ్ బాస్ అనగానే బయట రిలేషన్ లో ఉన్నా లేకపోయినా సరే ఇక్కడకి వచ్చాక ప్రేమ పక్షులుగా మారిపోతుంటారు. అలా హౌస్ లో వచ్చినప్పటి నుంచి నిఖిల్, సోనియాలు క్లోజ్ అయ్యారు. నిఖిల్ తో మాత్రమే కాకుండా మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా అనిపిస్తున్న పృధ్వితో కూడా క్లోజ్ గా ఉంటుంది సోనియా. ఈ ఇద్దరిని పెద్దోడు చిన్నోడు అని పేర్లు పెట్టి వారిద్దరిని తన కంట్రోల్ లో చేసుకుంది. అవసరమైనప్పుడు హగ్గులు గట్రా కానిచ్చేస్తున్నారు.

ఇక బిగ్ బాస్ హౌస్ లో సింపతీ గేం ఆడుతున్న మణికంఠ కూడా ఈ హగ్గులకు అలవాటు పడ్డాడు. అక్క అంటూ సోనియా అర్జెంట్ గా కెమెరాలు లేని చోటికి వెళ్లి మనం హగ్ చేసుకోవాలని అడిగితే ఆమె కూడా తమ్ముడూ అంటూ టైట్ హగ్ ఇచ్చింది. మరి ఈ సీజన్ లిమిట్ లెస్ ఎంటర్టైన్ మెంట్ అంటే ఇలా లిమిట్ లెస్ హగ్గులు ఇస్తున్నారేంటని ఆడియన్స్ అనుకోవడం జరుగుతుంది. అసలే బిగ్ బాస్ అంటే పడని కొందరు ఇప్పటికే ఇది బిగ్ బాస్ కాదు కామ బాస్ అనడం మొదలు పెట్టారు. సీజన్ 8 ఇప్పటివరకు పూర్తైన 3 వారాల్లో కంటెంట్ కన్నా అనవసరమైన స్టఫ్ఫే ఎక్కువ వచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.