Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 8 : తెలుగు వాళ్లకు అన్యాయం చేస్తున్నాడా..?

బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా కేవలం తెలుగు వారినే కాదు సీరియల్స్ లో నటించే కన్నడ నటీనటులను తీసుకుంటారు.

By:  Tupaki Desk   |   27 Oct 2024 6:24 AM GMT
బిగ్ బాస్ 8 : తెలుగు వాళ్లకు అన్యాయం చేస్తున్నాడా..?
X

బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా కేవలం తెలుగు వారినే కాదు సీరియల్స్ లో నటించే కన్నడ నటీనటులను తీసుకుంటారు. ముఖ్యంగా స్టార్ మా లో సీరియల్ యాక్టర్స్ కొంత క్రేజ్ తెచ్చుకున్నారు అంటే చాలు వారికి బిగ్ బాస్ ఇన్విటేషన్ వచ్చినట్టే లెక్క. బిగ్ బాస్ తెలుగులో కన్నడ ఇంకా స్టార్ మా బ్యాచ్ ల డామినేషన్ అన్నది ఎప్పుడు ఉండేదే. ఐతే ప్రతి సీజన్ లో ఇది కామన్ కాగా సీజన్ 8 లో మన తెలుగు వారికి అన్యాయం చేస్తున్నారు అంటూ ఒక కొత్త వాదన వినిపిస్తుంది. అదెలాగా అంటే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వారిలో కన్నడ వాళ్లు కూడా ఉన్నారు.

బిగ్ బాస్ సీజన్ 8 లో కంటెస్టెంట్ గా వచ్చిన నిఖిల్, ప్రేరణ, యష్మి, పృధ్వి రాజ్ వీళ్లంతా కూడా కన్నడ వారే. ఐతే హౌస్ లో మొదటి వారం నుంచి వాళ్ల డామినేషన్ కనిపిస్తుంది. అంతేకాదు టైటిల్ రేసులో నిఖిల్, ప్రేరణ ముందు వరసలో ఉన్నారు. పృధ్వి కూడా తన ఫిజికల్ ఆటతో సత్తా చాటుతున్నాడు. ఐతే ఈ సీజన్ లో తెలుగు వాళ్లకు అన్యాయం జరుగుతుంది అన్న వాదన బలంగా వినిపిస్తుంది. హౌస్ లో వారం మొత్తం జరిగిన టాస్కుల్లో మిగతా వారెంత రెచ్చిపోయి ఆడినా హోస్ట్ నాగార్జున ఏదో మొక్కుబడిగా మెచ్చుకుంటున్నట్టు ఉండగా.. కన్నడ వాళ్లు బాగా ఆడితే మాత్రం ఒక రేంజ్ లో ప్రశంసిస్తున్నారు.

హోస్ట్ గా నాగార్జున చేసేది కరెక్టేనా కాదా అన్నది చర్చ కాదు. కావాలని బిగ్ బాస్ టీం తెలుగు వాళ్లకు అన్యాయం చేస్తుందని ఆడియన్స్ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. హౌస్ లో తెలుగు వాళ్లైన తేజ, అవినాష్, విష్ణు ప్రియ, రోహిణి వీళ్లంతా కూడా ఈ సీజన్ లో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు. ఐతే మరో వెర్షన్ ఏంటంటే యాక్టింగ్ కోసం సొంత భాషను వదిలి తెలుగు నేర్చుకుని ఇక్కడ బిగ్ బాస్ లో ఛాన్స్ అందుకున్న వారిని పరభాష వాళ్లు అనడం కరెక్ట్ కాదని కొందరు వాదన.

ఈసారి టైటిల్ కన్నడ వాళ్లే కొడతారా తెలుగు వాళ్లకు ఆ హక్కు లేదా అంటే.. సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు గెలిచిన వారిని తీసుకుంటే భాషతో సంబంధం లేకుండానే బిగ్ బాస్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసిన వారిని ఎక్కువ ఓటింగ్ తెచ్చుకున్న వారిని టైటిల్ విన్నర్ గా చేశారు. ఒక షోలో అది కూడా తెలుగులో నటిస్తున్న నటీనటులను పరాయి వాళ్లు పరభాష వాళ్లు అని అనుకోవడం పొరపాటే అవుతుంది. అయినా సీజన్ 8 ముగియడానికి ఇంకా ఎనిమిది వారాల దాకా టైం ఉంది. ఈలోపు టైటిల్ రేసులో ఉన్న వారి లెక్క మారే ఛాన్స్ ఉంది.

సో అందుకే ఈ అనవసరమైన చర్చలు కాకుండా హౌస్ లో ఎవరు జెన్యూన్ గా ఉన్నారు. ఎవరు ఆటని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ గా ఆడుతున్నారు అన్నది చూసి అది తెలుగు వారైనా.. కన్నడ వారైనా సరే ఓట్ వేయాల్సిన బాధ్యత ఆడియన్స్ కు ఉంది. ఆడియన్స్ ఎవరిని విన్నర్ గా డిసైడ్ చేస్తారో వారికే ఆ టైటిల్ గెలిచే పూర్తి అర్హత ఉన్నట్టు లెక్క.