బిగ్ బాస్ 8 : షో టైమింగ్స్ లో మార్పు.. ఎందుకంటే..?
బిగ్ బాస్ సీజన్ 8 ని చివరి వారాల్లో షోని ప్రేక్షకులకు మరింత దగ్గర చేయాల్సింది పోయి టైమింగ్స్ మార్చి దూరం చేస్తున్నారు.
By: Tupaki Desk | 2 Dec 2024 4:13 AM GMTబిగ్ బాస్ సీజన్ 8 ని చివరి వారాల్లో షోని ప్రేక్షకులకు మరింత దగ్గర చేయాల్సింది పోయి టైమింగ్స్ మార్చి దూరం చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 8 వీక్ డేస్ అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9:30 గంటల నుంచి 10:30 గంటల వరకు ప్రసారం అవుతుంది. ఐతే హోస్ట్ నాగార్జున వచ్చే వీకెండ్ ఎపిసోడ్స్ అదే శని, ఆదివారాలు మాత్రం రాత్రి 9 గంటలకు మొదలవుతుంది.
ఐతే సడెన్ గా బిగ్ బాస్ టీం షో టైమింగ్స్ మార్చేస్తున్నారు. మరో రెండు వారాల్లో సీజన్ ముగుస్తుంది అనగా సోమవారం నుంచి శుక్రవారం వరకు షో 9:30 గంటల నుంచి 10 గంటలకు మార్చారు. 9:30 గంటల నుంచి మరో గంట పాటు చూడటమే చాలా కష్టం అనుకుంటుంటే.. 10:00 గంటల నుంచి 11:00 గంటల వరకు దీన్ని పొడిగించారు.
బిగ్ బాస్ ప్రసారం కావాల్సిన 9:30 గంటల నుంచి గీత ఎల్.ఎల్.బి అనే కొత్త సీరియల్ మొదలవుతుంది. ఎలాగు రెండు వారాల్లో అయిపోతుంది కాబట్టి షో టైం లో ఈ సీరియల్ ని పెట్టేశారు స్టార్ మా టీం. ఐతే అసలే 9:30 గంటలకే ఎవరు చూడని పరిస్థితి అయితే మరో అరగంట లేట్ గా అంటే కచ్చితంగా షో మీద ఆ ఎఫెక్ట్ పడుతుంది.
అంతకుముందు షో టి.ఆర్.పి గురించి హోస్ట్ నాగార్జున చెప్పే వారు. కానీ సీజన్ 8 ఆడియన్స్ ను అంతగా ఆకట్టుకోవట్లేదు కాబట్టి టి.ఆర్.పి రేటింగ్స్ గురించి ఈ సీజన్ లో అసలు చెప్పలేదు. కంటెస్టెంట్స్, టాస్కులు, గొడవలు ఇవన్నీ కూడా ఈ సీజన్ ని అంత ఆసక్తికరంగా మార్చలేదు.
అసలే సీజన్ నీరసంగా ఉంది అనుకునే టైం లో టైమింగ్స్ మార్చడం వల్ల మరింత ఎఫెక్ట్ పడుతుంది. ఐతే చూసేది తక్కువ మందే అయినా సోషల్ మీడియా ట్విట్టర్ అదే ఎక్స్ లో మాత్రం బిగ్ బాస్ గురించి బాగానే డిస్కషన్స్ జరుగుతున్నాయి. బిగ్ బాస్ సీజన్ 8 మరో రెండు వారాలు మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు హౌస్ మెట్స్ ఉన్నారు నెక్స్ట్ వీక్ ఒకరు ఎలిమినేట్ అయితే టాప్ 6 ఫైనలిస్ట్ గా ఉంటారు. అవినాష్ ఆల్రెడీ టికెట్ టు ఫినాలె గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. మరి ఆ తర్వాత ఐదు స్థానాలు ఎవరివి అన్నది రాబోయే రెండు వారాల్లో కంటెస్టెంట్స్ ఆటని బట్టి తెలుస్తుంది.