Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 8 : వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తో రీలోడ్ సెలబ్రేషన్స్..!

సీజన్ 8 ఇప్పటికే ఐదు వారాలు పూర్తి చేసుకోగా ఆటలో మరింత జోష్ పెంచేందుకు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని పంపిస్తున్నారు బిగ్ బాస్.

By:  Tupaki Desk   |   6 Oct 2024 5:56 AM GMT
బిగ్ బాస్ 8 : వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తో రీలోడ్ సెలబ్రేషన్స్..!
X

బిగ్ బాస్ సీజన్ 8 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కి టైం వచ్చేసింది. సీజన్ 8 ఇప్పటికే ఐదు వారాలు పూర్తి చేసుకోగా ఆటలో మరింత జోష్ పెంచేందుకు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని పంపిస్తున్నారు బిగ్ బాస్. ఐతే ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని ఇదివరకు సీజన్లలో చేసిన వారినే పంపించడం విశేషం. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో భాగంగా నేడు యాంకర్ రవి, హరి తేజ, గౌతం కృష్ణ, టేస్టీ తేజ, రోహిణి, మెహబూబ్, గంగవ్వ, నయని పావని ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నారు.

ప్రస్తుతం హౌస్ లో తొమ్మిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వారిలో ఈరోజు ఒకరు ఎలిమినేట్ అవుతారు. సో హౌస్ లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉంటారు. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గా మరో 8 మంది వెళ్తున్నారు. ఐతే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీని గ్రాండ్ గా ప్లాన్ చేశారు. బిగ్ బాస్ సీజన్ 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ టైం లో ఆడియన్స్ కు మరింత ఎంటర్టైన్ అందించేందుకు చూస్తున్నారు.

వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తో పాటుగా స్టార్ సెలబ్రిటీస్ కూడా హౌస్ లోకి వచ్చి సందడి చేశారు. జనక అయితే గనక టీం తో పాటు సుధీర్ బాబు మా నాన్న సూపర్ హీరో టీం కూడా హౌస్ లోకి వచ్చారు. బిగ్ బాస్ సీజన్ 8 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తో రీ లోడ్ సెలబ్రేషన్స్ ఒక రేంజ్ లో జరుగనున్నాయి. లేటెస్ట్ గా ఈరోజుకి సంబంధించిన ప్రోమో రిలీజ్ కాగా షో మరింత ఆసక్తికరంగా ఉండేలా ఉంది.

బిగ్ బాస్ సీజన్ 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎపిసోడ్ ఈరోజు 7 గంటలకే మొదలు కాబోతుంది. ఎనిమిది వైల్డ్ కార్డ్స్, హౌస్ లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఇక మీదట ఆట మరింత రసవత్తరంగా సాగుతుంది. ఆల్రెడీ బిగ్ బాస్ ఎక్స్ పీరియన్స్ చేసిన పాత కంటెస్టెంట్స్ తో పాటు ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఇద్దరు తలపడుతున్నారు. మరి వీరిలో ఎవరి ఆట ఎలా ఉంటుంది అన్నది చూడాలి.