Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 8.. ఈ 14 మంది కన్ఫర్మ్..!

4 రోజుల్లో ప్రారంభం కానున్న బిగ్ బాస్ సీజన్ 8 లో కంటెస్టెంట్స్ గా ఎవరెవరు వస్తున్నారు అన్నది ఇప్పటికే రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   28 Aug 2024 11:43 AM GMT
బిగ్ బాస్ 8.. ఈ 14 మంది కన్ఫర్మ్..!
X

4 రోజుల్లో ప్రారంభం కానున్న బిగ్ బాస్ సీజన్ 8 లో కంటెస్టెంట్స్ గా ఎవరెవరు వస్తున్నారు అన్నది ఇప్పటికే రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. ఒకరిద్దరు తప్ప మిగతా అంతా కూడా ఒకటే లిస్ట్ ని వైరల్ చేస్తున్నారు. బిగ్ బాస్ మొదలవుతుంది అంటే చాలు బుల్లితెర ఆడియన్స్ అంతా కూడా అలర్ట్ అవుతుంటారు. బిగ్ బాస్ సీజన్ 8 లో రాబోతున్న కంటెస్టెంట్స్ గురించి ఫైనల్ లిస్ట్ వచ్చినట్టే అని అంటున్నారు. దాదాపు 14 మంది బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా మరో నలుగురు అంటే మొత్తం 18 మంది కంటెస్టెంట్స్ ఈ సీజన్ లో పాల్గొంటున్నారు.

ఇక ఆల్రెడీ కన్ఫర్మ్ అయిన 14 మంది కంటెస్టెంట్స్ ఎవరు అన్నది చూస్తే.. ఆర్జే శేఖర్ భాషా హౌస్ లో వెళ్తున్నాడని తెలుస్తుంది. ఆర్జే గా చేసి ఆ క్రేజ్ తో వీడియో జాకీగా కూడా చేసిన శేఖర్ భాషా ఒకటి రెండు సినిమాల్లో కూడా కనిపించాడు. ఐతే రీసెంట్ గా రాజ్ తరుణ్, లావణ్య ల ఇష్యూ లో ఎక్కువగా అతని పేరు వినపడింది. ఎలాగు బిగ్ బాస్ కి కావాల్సింది కాంట్రవర్సీలే కాబట్టి శేఖర్ భాషాని తీసుకొస్తున్నారు బిగ్ బాస్ టీం.

ఇక ఈ సీజన్ లో స్టార్ మా సీరియల్ యాక్టర్ నిఖిల్ మలియక్కల్ కూడా హౌజ్ లోకి వస్తున్నట్టు తెలుస్తుంది. సీరియల్స్ తో పాటుగా రీసెంట్ గా స్టార్ మా లో వచ్చిన కిర్రాక్ బాయ్స్ ఖిలాడి గర్ల్స్ లో కూడా తన సత్తా చాటాడు నిఖిల్. ఈ సీజన్ వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అతను అవుతాడని చెప్పొచ్చు.

ఒకప్పటి హీరో ఆదిత్య ఓం కూడా ఈ సీజన్ లో కంటెస్టెంట్ గా రాబోతున్నట్టు తెలుస్తుంది. లాహిరి లాహిరి లాహిరిలో సినిమాలో లీడ్ రోల్ చేసిన అతను ఆ తర్వాత డైరెక్టర్, ప్రొడ్యూసర్ గా కూడా చేశారు. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్లీ బిగ్ బాస్ తోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఆదిత్య ఓం.

బిగ్ బాస్ సీజన్ 8 లో కన్నడ నటి యష్మి గౌడ కూడా రాబోతుందని తెలుస్తుంది. స్టార్ మా లో కృష్ణ ముకుంద మురారి సీరియల్ తో ఫేమస్ అయిన ఈమె స్వాతి చినుకులు సీరియల్ తో తెలుగు బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది. ఢీ డాన్సర్ నైనిక అనసూరు కూడా బిగ్ బాస్ సీజన్ 8 లో కంటెస్టెంట్ గా సెలెక్ట్ అయినట్టు తెలుస్తుంది. డాన్సర్ గా, యూట్యూబర్ గా నైనికకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.

బిగ్ బాస్ సీజన్ 8 లో యాక్టర్ అభిరామ్ వర్మ కూడా కంటెస్టెంట్ గా రాబోతున్నాడని సమాచారం. రాహు, ఏకం సినిమాల్లో నటించిన అభిరామ్ వర్మ మిస్టర్ ఆంధ్ర ప్రదేశ్ గా కూడా గెలిచాడు. హౌస్ లో కూడా వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అభిరాం వర్మ రాబోతున్నాడు.

వీరితో పాటు యాక్టర్ అభయ్ నవీన్, కిరాక్ సీత, బెజవాడ బేబక్క, యాక్టర్ ఖయ్యూం, యాంకర్ విష్ణు ప్రియ, రీతు చౌదరి, విస్మయ శ్రీ, నా మనికంట బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గా రాబోతున్నారని తెలుస్తుంది. వీరితో పాటు సహర్ కృష్ణన్, ఇంద్రనీల్, న్యూస్ రీడర్ కళ్యాణి, జబర్దస్త్ రాకింగ్ రాకేష్ కూడా బిగ్ బాస్ 8 లో కంటెస్టెంట్ గా వస్తారని తెలుస్తుంది. ఐతే మొదటి రోజు హౌస్ లోకి 14 మందిని మాత్రమే పంపించి రెండో వారం నుంచే వైల్డ్ కార్డ్ ఎంట్రీ గా మరో నలుగురిని పంపిస్తారని టాక్.