BB8 : అత్యధిక పారితోషికం ఆమెదే, ఇతరులకు ఎంతంటే!
బుల్లి తెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఇటీవలే ప్రారంభం అయ్యింది.
By: Tupaki Desk | 3 Sep 2024 6:05 AM GMTబుల్లి తెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఇటీవలే ప్రారంభం అయ్యింది. వరుసగా ఆరో సీజన్ కి నాగార్జున హోస్ట్ గా చేస్తున్నాడు. గత సీజన్ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సీజన్ పై అందరి చూపు ఉంది. కానీ కంటెస్టెంట్స్ ఎంపిక విషయంలో ఎప్పటిలాగే నిర్వాహకులు విమర్శలు ఎదుర్కొంటున్నారు. పారితోషికం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశ్యంతో పెద్దగా ఫేమ్ లేని వారిని, ఫేడ్ ఔట్ అయిన వారిని ఎంపిక చేశారంటూ విమర్శలు వస్తున్నాయి. నెట్టింట బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ అందుకుంటున్న రెమ్యూనరేషన్స్ కి సంబంధించి చర్చ జరుగుతోంది.
కంటెస్టెంట్స్ లో ఒకరి పారితోషికం మరొకరికి తెలియదు. అలాంటిది వారి పారితోషికం ఎంత అనేది అధికారికంగా రావడం జరగదు. కానీ సోషల్ మీడియాలో కొందరు తమకు ఉన్న సోర్స్ ద్వారా, వారికి ఉన్న క్రేజ్ ద్వారా పారితోషికాలను అంచనా వేస్తూ ఉంటారు. అలా అంచనా వేయగా యాంకర్ విష్ణు ప్రియ అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కంటెస్టెంట్ అయ్యి ఉంటుందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ నిర్వాహకులు కంటెస్టెంట్స్ కి వారం వారం పారితోషికం ఇస్తూ ఉంటారు. కొన్ని వారాల తర్వాత వారి పారితోషికం పెంచే అవకాశాలు కూడా ఉంటాయి.
సోషల్ మీడియాలో ఎక్కువ మంది అంటున్నట్టుగా విష్ణు ప్రియ కు ఎక్కువ పారితోషికం దక్కే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే హౌస్ లోకి వెళ్లిన వారందరిలోకి ఆమె కే ఎక్కువ ఫేమ్ ఉంది. ఆమె ఎక్కువ మందికి తెలిసిన సెలబ్రిటీ. కనుక ఆమెకు షో నిర్వాహకులు ఎక్కువ పారితోషికం ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. ఆమె షో కు గ్లామర్ ను అద్దే అవకాశాలు కూడా ఉంటాయి, ఆ తర్వాత హీరో ఆదిత్య ఓం, సీరియల్ నటుడు నిఖిల్ లు ఎక్కువ పారితోషికం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. వారి తర్వాత సోనియా, యష్మి గౌడ, ప్రేరణ, శేఖర్ భాష ల పారితోషికం ఉంటుందని అంచనా.
కంటెస్టెంట్స్ పారితోషికం వారానికి...
విష్ణు ప్రియ : రూ. 3.75 లక్షలు
ఆదిత్య ఓం : రూ. 3 లక్షలు
నిఖిల్ : రూ. 3 లక్షలు
యష్మి గౌడ : రూ. 2.5 లక్షలు
సోనియా : రూ.2.5 లక్షలు
ప్రేరణ : రూజ 2.5 లక్షలు
శేఖర్ భాష : రూ. 2.5 లక్షలు
నైనిక : రూ. 2.3 లక్షలు
కిర్రాక్ సీత : రూ.2.2 లక్షలు
అభయ్ నవీన్ : రూ. 2 లక్షలు
నబీల్ అఫ్రిది : రూ. 1.75 లక్షలు
ఇతరులకు రూ. 1.5 లక్షల నుంచి రూ. 1.25 లక్షల వరకు పారితోషికంగా ఇస్తున్నట్లు సమాచారం అందుతోంది.