Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 8 : గౌతం టఫ్ ఫైట్.. హౌస్ మేట్స్ కి బ్యాడ్ జామర్స్ సర్ ప్రైజ్..!

ఇక మరోపక్క నేడు బ్యాండ్ జామర్స్ తో స్పెషల్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు బిగ్ బాస్.

By:  Tupaki Desk   |   5 Dec 2024 12:26 PM GMT
బిగ్ బాస్ 8 : గౌతం టఫ్ ఫైట్.. హౌస్ మేట్స్ కి బ్యాడ్ జామర్స్ సర్ ప్రైజ్..!
X

బిగ్ బాస్ సీజన్ 8 లో ప్రస్తుతం కంటెస్టెంట్స్ కు తమ గురించి ఆడియన్స్ తో ఓట్ అప్పీల్ చేసుకునేందుకు టాస్క్ లు పెడుతున్నాడు. వాటితో పాటు 14 వారాలుగా వారు హౌస్ లో ఉంటున్న కారణంగా ఈ వీక్ మొత్తం వాళ్లకు చాలా రకాల సౌకర్యాలు కలిగిస్తున్నారు. నిన్న చెఫ్ సంజయ్ హౌస్ లోకి వెళ్లి కంటెస్టెంట్స్ కు కావాల్సిన మంచి భోజనాన్ని సిద్ధం చేసి వారి కడుపు నింపాడు. ఇక మరోపక్క నేడు బ్యాండ్ జామర్స్ తో స్పెషల్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు బిగ్ బాస్.

బిగ్ బాస్ సీజన్ 8 మరో వారం రోజుల్లో పూర్తి కాబోతుంది. అందుకే ఈ వారం కేవలం ఆడియన్స్ ని ఓట్ అప్పీల్ కోసమే టాస్కులు పెడుతున్నారు. ఐతే టాప్ 5 లేదా 6 రేసులో ఎవరు ఉంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఓట్ అప్పీల్ లో భాగంగా నేడు పవర్ ఫ్లాగ్ ఇచ్చాడు బిగ్ బాస్. ఐతే ఈ టాస్క్ లో గౌతం రెండు సార్లు తన సత్తా చాటి ప్రేరణని, నిఖిల్ ను ఆట లోనుంచి తొలగించాడు. ఆ తర్వాత రోహిణి ఫ్లాత్ అందుకోవడం వల్ల గౌతం ను ఆట నుంచి తీసేసింది.

రోహిణి అవినాస్ లో ఎవరు ఈరోజు ఓట్ అప్పీల్ ఛాన్స్ అందుకుంటారన్నది చూడాలి. ఇక నిన్న చెఫ్ సంజయ్ వచ్చినట్టుగానే బ్యాండ్ జామర్స్ తో స్పెషల్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. వారు కంటెస్టెంట్స్ కోసం మంచి సాంగ్స్ పాడి వినిపించనున్నారు. బిగ్ బాస్ సీజన్ 8 నేటి ఎపిసోడ్ ప్రోమోలో ఈ విషయం తెలుస్తుంది. ఇంతకీ ఈరోజు ఎవరెవరికి ఓట్ అప్పీల్ ఛాన్స్ వస్తుందో చూడాలి.

ఇక మరో వారం లో ముగుస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ విన్నర్ ఎవరన్నది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. నిఖిల్, గౌతం ల మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది. ఐతే గౌతం వైల్డ్ కార్డ్ వచ్చాడు. ఆల్రెడీ అంతకుముందు సీజన్ ఆడాడన్న కారణం చేత కొందరు గౌతం కాదు నిఖిలే విన్నర్ కావాలని అంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 8 లో టైటిల్ విన్నరే కాదు టాప్ 5 కి చేరే వాళ్లెవరు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. అవినాష్ తో పాటు నిఖిల్, గౌతం లు ఓకే అవగా మిగతా ఇద్దరు ఎవరన్నది తెలియాల్సి ఉంది.