Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 8 : స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యాడా..?

ఐతే వీరిలో ఈ వారం శేఖర్ బాషా ఎలిమినేట్ అయినట్టుగా సమాచారం.

By:  Tupaki Desk   |   14 Sep 2024 5:40 PM GMT
బిగ్ బాస్ 8 : స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యాడా..?
X

బిగ్ బాస్ సీజన్ 8 నుంచి రెండో ఎలిమినేషన్ ఎవరన్నది ఆదివారం తెలుస్తుంది. ఐతే శనివారమే ఆ ఎపిసోడ్ షూట్ చేయడంతో అది ముందే లీక్ అవుతుంది. బిగ్ బాస్ సీజన్ 8 నుంచి 2 వ ఎలిమినేషన్ షాకింగ్ గా ఉందని తెలుస్తుంది. హౌస్ లో స్ట్రాంగ్ అనుకున్న కంటెస్టెంట్ ఎలిమినేట్ అయినట్టుగా చెప్పుకుంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 8 లో 2వ వారం ఎనిమిది మంది హౌస్ మెట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. వారిలో విష్ణు ప్రియ, సోనియా, శేఖర్ బాషా, పృధ్వి, నైనిక, నిఖిల్, ఆదిత్య ఓం, మణికంఠ ఉన్నారు. ఐతే వీరిలో ఈ వారం శేఖర్ బాషా ఎలిమినేట్ అయినట్టుగా సమాచారం.

ఐతే ఈ ఎలిమినేషన్ కరెక్టా కాదా అన్నది ఆదివారం ఎపిసోడ్ పూర్తయ్యాక తెలుస్తుంది. ఆర్జే గా శేఖర్ బాషా దాదాపు 15 ఏళ్లుగా తెలుగు ఆడియన్స్ కు పరిచయమే. ఐతే ఈమధ్య రాజ్ తరుణ్, లావణ్య ఇష్యూలో వారిద్దరికి ఈక్వల్ గా వార్తల్లో నిలిచాడు శేఖర్ బాషా. హౌస్ లో చాలా కంపోజ్డ్ గా తన పని ఏదో తను చేసుకుంటూ వెళ్తున్నాడు శేఖర్ బాషా.

నామినేషన్స్ లో ఉన్న అందరిలో శేఖర్ బాషా లీస్ట్ ఓటింగ్ సంపాదించాడని తెలుస్తుంది. ఐతే మొదటి వారమే బెజవాడ బేబక్క హౌస్ ని వీడింది. శేఖర్ బాషా కొన్నాళ్లు హౌస్ లో ఉంటాడు కాస్త టాస్క్ ల మీద దృష్టి పెడితే టాప్ 5 దాకా వెళ్తాడని అనుకోగా ఆడియన్స్ అతన్ని లైట్ తీసుకున్నారు. శేఖర్ బాషా ఎలిమినేషన్ నిజమేనా కాదా అన్నది ఆదివారం తెలుస్తుంది.

బిగ్ బాస్ సీజన్ 8 రెండో వారాలు పూర్తయ్యే సరికి ప్రేక్షకుల్లో ఎవరు స్ట్రాంగ్ ఎవరు వీక్ అన్నది కొంత క్లారిటీ వచ్చింది. ఐతే శేఖర్ బాషా కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకోగా అతను టాస్కులు సరిగా ఆడకపోవడం వల్ల పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. హౌస్ లో ప్రతి పదానికి మరో అర్ధం చెబుతూ అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాడు శేఖర్ బాషా మరి అతని ఎలిమినేషన్ ఆడియన్స్ ని నిజంగానే షాక్ అయ్యేలా చేస్తుందని చెప్పొచ్చు. బిగ్ బాస్ సీజన్ 8 లో ఇప్పుడిప్పుడే ఆట రసవత్తరంగా మారుతుంది. హౌస్ మెట్స్ అంతా సీరియస్ గా టాస్కుల్లో పాల్గొంటున్నారు.