బిగ్ బాస్ 7.. నాగ్ రెమ్యునరేషన్ పెంచారా?
బిగ్ బాస్ సీజన్ 7 రీసెంట్ గా ప్రారంభమైంది. ఈ సారి గేమ్ షోని సరికొత్తగా చేంజ్ చేసి 14 మంది కంటిస్టెంట్ లని హౌస్ లోకి పంపించారు
By: Tupaki Desk | 9 Sep 2023 4:59 AM GMTబిగ్ బాస్ సీజన్ 7 రీసెంట్ గా ప్రారంభమైంది. ఈ సారి గేమ్ షోని సరికొత్తగా చేంజ్ చేసి 14 మంది కంటిస్టెంట్ లని హౌస్ లోకి పంపించారు. ఇందులో సినిమా స్టార్స్ నుంచి సీరియల్, యుట్యూబ్ సెలబ్రెటీలు కూడా ఉన్నారు. డిఫరెంట్ గేమ్ షోలతో వీక్షకులని రంజింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. సీజన్ 6 ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో సీజన్ 7 కోసం గేమ్ విధానంలో చాలా మార్పులు చేశారు.
ఇదిలా ఉంటే నిజానికి బిగ్ బాస్ సీజన్ 7కి కింగ్ నాగార్జున హోస్ట్ చేయరనే ప్రచారం తెరపైకి వచ్చింది. ఆయన ఆసక్తి చూపించడం లేదని సోషల్ మీడియాలో కథనాలు ప్రసారం అయ్యాయి. అయితే అలాంటిదేం లేదని తరువాత క్లారిటీ వచ్చింది. బిగ్ బాస్ 7 హోస్టింగ్ కోసం కింగ్ నాగార్జునని రెమ్యునరేషన్ డబుల్ ఆఫర్ చేసి నిర్వాహకులు అతన్ని హోల్డ్ చేశారనే టాక్ వైరల్ అయ్యింది. గత సీజన్ తో పోల్చుకుంటే రెట్టింపు ఇస్తున్నారని గాసిప్స్ వినిపించాయి.
అయితే అలాంటిదేం లేదని తెలుస్తోంది. గత సీజన్ తో పోల్చుకుంటే రెమ్యునరేషన్ కాస్తా పెరిగిన మాట వాస్తవమే అయినా మరీ రెట్టింపు అయితే ఇవ్వడం లేదని సమాచారం. అలాగే బిగ్ బాస్ 7 హోస్టింగ్ చేయనని కూడా కింగ్ నాగార్జున వారికి చెప్పలేదంట. కానీ ఈ సారి షో ఎలా ఉండబోతుందనేది చర్చించారంట. ప్రతి ఏడాదితో పోల్చుకుంటే ఈ సారి షో ప్రారంభం నెల ఆలస్యం అయ్యింది.
దీనికి కారణం ఈ సారి గేమ్ షోలో మార్పులు చేయడమే అని తెలుస్తోంది. ఆ మార్పులు కూడా షోలో ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హౌస్ లో ఉన్న కంటిస్టెంట్ లకి డూ ఆర్ డై అనే విధంగా గేమ్స్ పెడుతున్నారు. హౌస్ లో కొనసాగాలంటే టాస్క్ లు విన్ అవ్వాల్సిందే అనే నిబంధనలు పెట్టడం వలన ప్రతి ఒక్కరు కస్టపడి గేమ్ అడుగుతున్నారు.
ఇది ఆడియన్స్ లో కూడా షోపై ఆసక్తి పెరిగేలా చేస్తోంది. మరి ఇదే ఇంటెన్షన్ ని ఎంత వరకు బిగ్ బాస్ టీమ్ కొనసాగిస్తుందనేది చూడాలి. కింగ్ నాగార్జున ఓ వైపు నా సామి రంగా సినిమాని సెట్స్ కి తీసుకెళ్లే పనిలో ఉన్నారు. ఆ మూవీ చేస్తూనే వారంలో ఒక రోజు తనకి సంబందించిన ఎపిసోడ్స్ షూట్ చేయడానికి కాల్ షీట్స్ ఇస్తున్నారు.