Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 7 : ఎలిమినేషన్ ఊహించిన సందీప్.. అలా రికార్డ్ కొట్టేశాడుగా..!

బిగ్ బాస్ ఇన్ని సీజన్ లలో ఏడు వారాలు నామినేట్ అవకుండా రికార్డు సృష్టించాడు సందీప్.

By:  Tupaki Desk   |   30 Oct 2023 7:17 AM GMT
బిగ్ బాస్ 7 : ఎలిమినేషన్ ఊహించిన సందీప్.. అలా రికార్డ్ కొట్టేశాడుగా..!
X

బిగ్ బాస్ సీజన్ 7 నుంచి 8వ వారం సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. ఈ సీజన్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ లో ఒకరిగా ఉంటున్న సందీప్ మొదటి వారమే పవర్ అస్త్ర గెలుచుకుని మొదటి హౌస్ మెట్ గా మారాడు. దాని వల్ల వచ్చిన ఐదు వారాలు ఇమ్యూనిటీ పొందాడు. సో ఐదు వారాలు నామినేషన్స్ లో లేకపోవడం వల్ల సందీప్ కి ఫ్యాన్ బేస్ పెరగలేదు. అంతేకాదు ఐదో వారం పూర్తయ్యాక ఆరో వారం నామినేషన్స్ లో లేడు.

ఏడో వారం నామినేషన్స్ లో ఉన్నా గౌతం వల్ల అతను సేఫ్ అయ్యాడు. సో అలా ఏడు వారాలు నామినేషన్స్ లో లేకుండా ఎనిమిదో వారం నామినేషన్స్ లోకి మొదటిసారి వచ్చి ఆ వీకే ఎలిమినేట్ అవడం విశేషం. బిగ్ బాస్ ఇన్ని సీజన్ లలో ఏడు వారాలు నామినేట్ అవకుండా రికార్డు సృష్టించాడు సందీప్. ఆ విధంగా తన రికార్డ్ ఎవరు బ్రేక్ చేయలేరని చెప్పొచ్చు.

సందీప్ తన ఎలిమినేషన్ ని ముందే ఊహించినట్టుగా కనిపించాడు. శనివారం ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున బొంగులో అంటూ చాలా సార్లు అన్నాడు. అంతేకాదు ఆదివారం శోభాతో తనని డేంజర్ జోన్ లో ఉంచగా అతను అప్పటికే ఎలిమినేట్ అయ్యేది తనే అని ఫిక్స్ అయ్యి కూల్ గా ఉన్నాడు. అయితే సందీప్ ఎలిమినేషన్ ఊహించని హౌస్ మెట్స్ షాక్ అయ్యారు. అతనితో క్లోజ్ గా ఉన్న అమర్ దీప్, ప్రియాంక, శోభా శెట్టి ఎమోషనల్ అయ్యారు.

సందీప్ ని నామినేట్ చేసిన తేజ కూడా బాగా ఎమోషనల్ అయ్యాడు. తేజ నామినేట్ చేసిన వాళ్లు ఎలిమినేట్ అవ్వడం జరుగుతుంది. ఆ విషయంలో తను నామినేట్ చేయడం వల్లే సందీప్ ఎలిమినేట్ అయ్యాడని తేజ బాగా ఎమోషనల్ అయ్యాడు. మొత్తానికి సందీప్ ఎలిమినేషన్ హౌస్ మేట్స్ ని షాక్ అయ్యేలా చేసిందని చెప్పొచ్చు.

సందీప్ ఎక్కువగా ఫౌల్ గేమ్ ఆడటం.. తన పాయింట్ స్ట్రాంగ్ గా చెప్పడంలో ఫెయిల్ అవడం వల్లే ఎలిమినేట్ అయ్యాడని చెప్పొచ్చు. ఫిజికల్ గా స్ట్రాంగ్ అయినా కూడా అమర్ దీప్ తో అతను ఆడిన ఆట తీరు ఆడియన్స్ ని మెప్పించలేదు. పైగా ఎనిమిది వారాల్లో మొదటిసారి నామినేషన్స్ లోకి రావడం వల్ల ఓటింగ్ అనేది అనుకున్న విధంగా పడలేదు. సో అలా సందీప్ మాస్టర్ హౌస్ నుంచి బయటకు రావాల్సి వచ్చింది.