Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 8 : వెళ్తూ వెళ్తూ వాళ్లని రోడ్డున పడేసిన బేబక్క..!

బిగ్ బాస్ సీజన్ 8 మొదటి ఎలిమినేషన్ అనుకున్నట్టుగానే బెజవాడ బేబక్క బయటకు వచ్చేసింది.

By:  Tupaki Desk   |   9 Sep 2024 4:43 AM GMT
బిగ్ బాస్ 8 : వెళ్తూ వెళ్తూ వాళ్లని రోడ్డున పడేసిన బేబక్క..!
X

బిగ్ బాస్ సీజన్ 8 మొదటి ఎలిమినేషన్ అనుకున్నట్టుగానే బెజవాడ బేబక్క బయటకు వచ్చేసింది. నామినేషన్స్ లో ఆరుగురు కంటెస్టెంట్స్ ఉండగా వారిలో సోనియా శనివారమే సేవ్ అవ్వగా ఆదివారం నాడు శేఖర్ బాషా, పృథ్వీరాజ్, విష్ణు ప్రియ సేవ్ అవుతూ వచ్చారు. ఇక ఫైనల్ గా నాగ మణికంఠ, బేబక్క ఇద్దరు లీస్ట్ లో ఉండగా వారిద్దరిని యాక్టివిటీ ఏరియాకు రమ్మని చెప్పిన నాగార్జున వారి ముందు ఉంచిన డ్రం కొట్టమని చెప్పి దానిలో ఒక షీట్ ఉంటుంది అందులో ఎవరు సేఫ్ ఎవరు ఎవిక్టెడ్ అన్నది ఉంటుందని అన్నారు.

ఆ ప్రాసెస్ లో మణికంఠ, బేబక్క ఇద్దరు ఒకేసారి ఆ షీట్ ఓపెన్ చేయగా బేబక్క ఎవిక్టెడ్ కాగా మణికంఠ సేవ్ అయ్యాడు. ఇక ఎలిమినేట్ అయిన బేబక్క హౌస్ నుంచి స్టేజ్ మీదకు వచ్చింది. ఏవీ చూపించిన నాగార్జున వారం రోజుల్లోనే స్వీట్ అండ్ షార్ట్ జర్నీ అంటూ చెప్పారు. ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండేది ఇంత త్వరగా వచ్చేస్తానని ఊహించలేదని బేబక్క అన్నది. ఇక వెళ్తూ వెళ్తూ హౌస్ లో ఉండటానిక్ అర్హత లేదో వాళ్ల ఫోటోలను ఇచ్చిన రోడ్ మీద పెట్టాలని అన్నారు నాగార్జున

అందులో బేబక్క ముందు సోనియా, పృథ్వీరాజ్, మణికంఠ, నిఖిల్ ఫోటోలను రోడ్ మీద పెట్టింది. వెళ్తూ వెళ్తూ ఆ నలుగురిని రోడ్డున పడేసింది బేబక్క. అంటే ఆమె ఉద్దేశంలో ఈ నలుగురు హౌస్ కి ఫిట్ కాదన్నట్టుగా ఆమె చెప్పుకొచ్చింది. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా ఫేమస్ అయిన బేబక్క ఆ క్రేజ్ తో బిగ్ బాస్ ఛాన్స్ అందుకుంది. ఐతే ఎలిమినేషన్ అనేది ఆడియన్స్ ఓటింగ్ తోనే జరుగుతుందని తెలిసిందే.

లాస్ట్ వీక్ నామినేషన్స్ లో ఆరుగురు హౌస్ మెట్స్ ఉండగా బేబక్కకు లీస్ట్ ఓటింగ్ వచ్చింది. అయితే హౌస్ లోకి వెళ్లిన తొలిరోజే సోనియా బేబక్కతో కుక్కర్ విషయంలో గొడవ పెట్టుకుంది. బేబక్క ఇర్రెస్పాన్సిబిలిటీ గా ప్రవర్తించిందని సోనియా ఫైర్ అయ్యింది. అప్పటి నుంచి బేబక్కకు సొనియాకు మధ్య దూరం కొనసాగింది. తను స్ట్రాంగ్ అనుకున్న నిఖిల్ కూడా సోనియాకు దగ్గరవ్వడం బేబక్క అతనికి కూడా దూరమైంది. శనివారం అతని క్లాన్ లో తాను ఉండదలచుకోలేదని హోస్ట్ నాగార్జునకే చెప్పి చేతి బ్యాండ్స్ తీసేసింది. ఐతే ఆమె ఈ వారం హౌస్ నుంచి బయటకు వచ్చేస్తుందని మాత్రం అస్సలు ఊహించలేదని తెలుస్తుంది.